Cranberry Tea : ఉరుకుల పరుగుల జీవితంలో స్ట్రెస్‌ను తొలగించి కాస్త రిలాక్సేషన్ అందించే పానీయాల్లో ప్రతి ఒక్కరూ ఇష్టంగా తేనీరు సేవిస్తుంటారు. టీ, ఛాయ్ ఇలా పేరేదైనా ఈ పానీయం గొంతు దిగనిదే మనలో చాలా మందికి రోజు ప్రారంభం కాదు. ఇక గ్రీన్ టీ, మసాలా టీ ఇలా ఎన్నో రకాల టీలు తేనీటి ప్రియులను అలరిస్తుంటే ఇక శరీరాన్ని తేలికపరిచి ఒత్తిడిని మటుమాయం చేసేలా ఫ్రూట్, ఫ్లవర్ టీలు కూడా వచ్చేశాయి.
ఇక ఎంతో రుచిని అందిస్తూ పలు ఆరోగ్య ప్రయోజనాలను అందించే క్రాన్బెర్రీ టీ ఇటీవల బహుళ ప్రాచుర్యం పొందుతోంది. ఉదయాన్నే తీసుకునే మార్నింగ్ ఛాయ్ లేదా లేట్ నైట్ గ్రీన్ టీకి ప్రత్యామ్నాయంగా క్రాన్బెర్రీ టీని ఆస్వాదించవచ్చు.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే క్రాన్బెర్రీ టీతో వ్యాధుల బారినపడకుండా ఉండే పదార్ధాలున్నాయి. పాలీపెనాల్స్, జీఆక్సిన్థిన్, ఫ్లేవనాయిడ్లు, లుటీన్, ప్రొయాంథీసియనిడిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నియంత్రిస్తాయి. ఇక క్రాన్బెర్రీ టీతో చేకూరే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
యాంటీఆక్సిడెంట్లు పుష్కలం
మూత్రాశయ ఆరోగ్యం మెరుగుదల
బరువు తగ్గుదల
బీపీ నియంత్రణ
చర్మ సంరక్షణ
Read More :
Florida Man | మెదడుకు సర్జరీ చేస్తుంటే గిటార్ వాయించాడు..!