Health Tips | శృంగారం ఇది ఒక గొప్ప అనుభూతి. ఆలుమగల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. మనస్పర్థలను దూరం చేసి.. మనసులను ఏకం చేస్తుంది. అంతటి గొప్ప శృంగారానికి దూరంగా ఉండటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. బతుకు బండిని లాగే క్రమంలో దంపతులిద్దరూ మానసిక ఒత్తిళ్లకు గురికావడం, ఇతర సమస్యల కారణంగా శృంగారానికి సరిగా సమయం కేటాయించలేకపోతున్నారు. అంతేకాదు సరియైన ఆహారం కూడా తీసుకోలేక.. పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శృంగార జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు మన వంటింట్లోనే దివ్య ఔషధాలు ఉన్నాయన్న విషయాన్ని అసలే మరిచిపోవద్దు.. అవేంటో ఒకసారి చూద్దాం..
యాలకులు మంచి సువాసనను వెదజల్లుతాయి. మంచి రుచిని కూడా అందిస్తాయి. ఈ యాలకులు లైంగిక సమస్యలకు దివ్య ఔషధం కూడా. శృంగార సమస్యలకు యాలకులతో చెక్ పెట్టొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సువాసనతో ఒత్తిడిని దూరం చేసుకొని, శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. వీర్య కణాల వృద్ధి కూడా గణనీయంగా పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. రోజుకు కనీసం 2 నుంచి 3 యాలకులు తినడం వల్ల లైంగిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. శీఘ్ర స్కలన సమస్య నుంచి కూడా బయటపడొచ్చు.
లవంగాలు కూడా ప్రతి వంటింట్లో ఉంటాయి. లవంగాల పొడి లేకుండా ఏ కూర కూడా చేయరు. ముఖ్యంగా లవంగాలు పురుషుల లైంగిక సమస్యలను పరిష్కరించడంలో బాగా పని చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. టెస్టోస్టీరాన్ స్థాయిని పెంచడంలో లవంగం నూనె సహాయ పడుతుందని చెబుతున్నారు. శీఘ్ర స్కలన సమస్యను నివారించడంతో పాటు వీర్య కణాలను కూడా పెంచుతుంది. లవంగం నూనె వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. తద్వారా శరీరంలో ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. లవంగం నూనె శరీరంలో శక్తిని, నాడీ ఉత్సాహాన్ని పెంచుతుంది. దీని వల్ల శీఘ్ర స్కలనం సమస్య తగ్గుతుంది. ఎక్కువ సేపు శృంగారాన్ని ఆస్వాదించవచ్చు.
కుంకుమ పువ్వును వివిధ వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇది పురుషుల్లో శృంగార శక్తిని పెంచడంలో తోడ్పాటును అందిస్తుంది. వ్యంధత్వాన్ని తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. శృంగారానికి ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. అంగస్తంభన సమస్యను నివారిస్తుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మెంతులను కూడా ప్రతి వంటకంలో వాడుతారు. మెంతి ఆకులు, మెంతి గింజలు ఆరోగ్యానికి మంచిది. పురుషుల లైంగిక ఆరోగ్య విషయంలో మెంతులు చాలా కీలకపాత్ర పోషిస్తాయి. మెంతులను మెనూలో భాగం చేసుకోవడం వల్ల శృంగార సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని పెంచడంలో మెంతులు అద్భుతంగా పనిచేస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది.