తల.. మెడ క్యాన్సర్లు.. తొలిదశలో గుర్తిస్తే మంచి ఫలితాలు!
శరీరంలోని తల, శ్వాస, జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్లను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణిస్తారు. పెదవులు, నోరు, చిగుర్లు, నాలుక, ముక్కు రంధ్రాలు, ఫేరింక్స్, స్వరపేటిక వంటి భాగాలలో ఈ క్యాన్సర్లు వస్తాయి.
శరీరంలోని తల, శ్వాస, జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్లను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణిస్తారు. పెదవులు, నోరు, చిగుర్లు, నాలుక, ముక్కు రంధ్రాలు, ఫేరింక్స్, స్వరపేటిక వంటి భాగాలలో ఈ క్యాన్సర్లు వస్తాయి. ఇవి 90% వరకూ స్కామస్ సెల్ కార్సినోమా రకానికి చెందినవి. అంటే మ్యూకస్ ఉండి ఎప్పుడూ తడిగా ఉండే లోపలి పెదవులు, చిగుర్లు, నాలుక వంటి భాగాల్లో ఈ క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తాయి. మెదడు, థైరాయిడ్ గ్రంథి, తలలోని కండరాలు, చర్మానికి వచ్చే క్యాన్సర్లు.. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల కిందకు రావు.
దురలవాట్ల వల్లే ఈ క్యాన్సర్లు..
ఆల్కహాల్, పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పత్తులే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకు ప్రధాన కారణాలు. ఆల్కహాల్, పొగాకు అలవాట్లు ఉంటే.. ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశం 75శాతం వరకు ఉంటుంది.
వీటికి వచ్చే అవకాశం
- ఓరల్ క్యావిటి (పెదవులు, నాలుక, చిగుర్లు, నోటి లోపలి కింది, పై భాగాలు, జ్ఞానదంతాల వెనుకవైపు ఉండే చిగుళ్లు)
- ఫేరింజియల్ : ముక్కు వెనుక ఐదు అంగుళాల వరకు పొడవు ఉండి, అన్నవాహికను కలిపే గొట్టం.
- లేరింజియల్ : మాట్లాడటానికి సహకరించే స్వరపేటిక, స్వర తంత్రులు, ఆహారాన్ని శ్వాస నాళాలలోకి పోకుండా అడ్డుకునే కొండనాలుక.
- పారానాసల్ సైనసెస్ మరియు నాసల్ క్యావిటి : తల మధ్యభాగంలో, ముక్కుకు ఇరువైపులా బోలుగా ఉండే సైనస్.
- లాలాజల గ్రంథులు : నోటిలోపల కింది భాగంలో, దవడ ఎముకలకు ఇరువైపులా ఉండే గ్రంథులు లాలాజలగ్రంథులు.
లక్షణాలు
- నోటిలో తెలుపు, ఎరుపు మిళితమైన మచ్చలు
- గొంతు నొప్పి, గొంతు బొంగురు పోవడం
- ఆహార పదార్థాలు మింగలేకపోవడం
- దవడలు వాయడం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- మాట్లాడటానికి కష్టంగా ఉండటం
- తలనొప్పి
- వినికిడి శక్తి తగ్గడం, తరచూ చెవిపోటు రావడం
నిర్ధారణ పరీక్షలు
పై లక్షణాలు కనిపించినా, అనుమానాస్పదంగా ఉన్నా.. బయాప్సి, ఎంఆర్ఐ, సీటీ, పెట్ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రొసీజర్లతో క్యాన్సర్ వచ్చిన భాగాన్ని, దశను, గ్రేడింగ్లను నిర్ధారిస్తారు.
చికిత్స పద్ధతులు : క్యాన్సర్ సోకిన భాగం, దశ, రోగి వయసు, ఆరోగ్య వివరాల ఆధారంగా చికిత్స పద్ధతులు ఉంటాయి. సర్జరీ, రేడియేషన్, కీమో, టార్గెటెడ్ థెరపీ లేదా కొన్ని రకాల కాంబినేషన్ థెరపీలను అవసరాన్ని బట్టి నిర్ణయిస్తారు. తల, మెడ వంటి సున్నితమైన భాగాలలో చికిత్స చేసినప్పుడు, ఆ చికిత్స పూర్తయిన తర్వాత వాటి పనితీరులో, మొహంలో అనేక మార్పులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు గొంతులో మార్పు, నమలడానికి ఇబ్బందిపడటం, దవడ ఎముక పట్టేసినట్లు ఉండటం, మొద్దుబారినట్లుగా ఉండటం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి, సర్జరీలను చాలా జాగ్రత్తగా చేసే అనుభవజ్ఞులైన వైద్యుల దగ్గరే చేయించుకోవడం చాలా ముఖ్యం. తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే స్టేజ్-1, స్టేజ్-2లో కూడా కేవలం సర్జరీతోనే వ్యాధిని శాశ్వతంగా నయం చేయవచ్చు. సర్జరీ తరువాత పునర్నిర్మాణ శస్త్రచికిత్స అవసరం ఎక్కువగా ఉంటుంది. స్టేజ్-3, 4లో ఉన్న రోగులకు కీమో, రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 3డీసీఆర్టీ, వీఎంఏటీ, ఐజీఆర్టీ, ఐజీకేటీ, బ్రాకీథెరపీ, బీమ్ థెరపీ వంటి ఆధునిక పద్ధతుల ద్వారా చికిత్స అందించవచ్చు. సాధారణంగా ఈ క్యాన్సర్ల చికిత్సలో కీమోథెరపీ పాత్ర తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కీమోను మిశ్రమ చికిత్సగా అందిస్తారు.
– డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98490 22121
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

