జుట్టుకు మెగ్నీషియం జట్టు
వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. కొంతమందిలో అసలు జుట్టే పెరగట్లేదన్న ఆరోపణ ఉంటుంది. కానీ ఈ సమస్యలు వచ్చినప్పుడు అందరూ రకరకాల షాంపూలు, నూనెలు, సీరమ్‌లు అంటూ ప్రయోగాలు చేస్తారు తప్ప సమస్యకు మూలం కనుక్కోరు.
వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. కొంతమందిలో అసలు జుట్టే పెరగట్లేదన్న ఆరోపణ ఉంటుంది. కానీ ఈ సమస్యలు వచ్చినప్పుడు అందరూ రకరకాల షాంపూలు, నూనెలు, సీరమ్‌లు అంటూ ప్రయోగాలు చేస్తారు తప్ప సమస్యకు మూలం కనుక్కోరు. నిజానికి జుట్టు ఆరోగ్యానికి శరీరంలోని మెగ్నీషియం స్థాయులకు దగ్గరి సంబంధం ఉంది. శరీరంలో మెగ్నీషియం లోపించినప్పుడే ఈ సమస్యలు వస్తాయి. ఇదే విషయాన్ని పరిశోధకులు ఎన్నో అధ్యయనాల్లో తేల్చారు కూడా. రోజువారీగా తీసుకునే ఆహారంలో శరీరానికి సరిపడా మెగ్నీషియం అందేలా చూసుకోవాలి.
అలాగే వైద్యులను సంప్రదించి మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవచ్చు. మాడుకు రక్త ప్రసరణ బాగా జరగడంలో, హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో, క్యాల్షియం స్థాయులను క్రమబద్ధీకరించడంలో మెగ్నీషియం తోడ్పడుతుంది. తద్వారా జుట్టుకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. మెగ్నీషియం లోపం వల్ల మాడుకు రక్త ప్రసరణ తగ్గడంతో పోషకాలు అందక జుట్టును సమస్యలు చుట్టుముడుతాయి. శరీరంలో సరైన మోతాదులో మెగ్నీషియం లేకపోతే, క్యాల్షియం ఎక్కువై కుదుళ్లు మూసుకుపోతాయి. దానివల్ల హెయిర్ సైకిల్ దెబ్బతింటుంది. అలాగే మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణం తగ్గి మాడుపై పుండ్లు, దురద లాంటి సమస్యలు వస్తాయి. శరీరానికి తగినంత మోతాదులో మెగ్నీషియం అందాలంటే ఈ కింద పేర్కొన్న ఆహార పదార్థాలకు మీ డైట్లో చోటివ్వండి.
- పాలకూర వంటి ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు
- గుమ్మడి గింజలు, బాదంపప్పు, జీడిపప్పు, అవిసె గింజలు, చియా గింజలు
- బీన్స్, చిక్కుళ్లు, అన్నిరకాల పప్పులు
- అరటిపండ్లు, జామపండ్లు, కివీ, బొప్పాయి, అత్తి పండ్లు, ఖర్జూరాలు, అవకాడో
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

