తొలి యూనిసెక్స్ కండోమ్‌ను రూపొందించిన గైనకాలజిస్ట్

పురుషులు,మహిళలు ఉపయోగించే యూనిసెక్స్ కండోమ్‌ను ప్రపంచంలోనే తొలిసారిగా మలేషియాకు చెందిన గైనకాలజిస్ట్ జాన్ ట్యాంగ్ఇంగ్ చిన్ అభివృద్ధి చేశారు. మెరుగైన రక్షణ ఇవ్వడంతో పాటు ట్రాన్స్పరెంట్గా ఉండే మెటీరియల్‌తో ఈ కండోమ్స్‌ను తయారు చేశారు. వండలీఫ్ యూనిసెక్స్ కండోమ్‌ను కనుగొన్న చిన్ ట్విన్ క్యాటలిస్ట్ అనే వైద్య పరికరాల సరఫరాల సంస్ధలో పనిచేస్తున్నారు. గాయాలకు డ్రెస్సింగ్ చేసేందుకు ఉపయోగించే మెడికల్ గ్రేడ్ మెటీరియల్స్‌తో చేసిన ఈ కండోమ్ ఇతర కండోమ్స్ మాదిరే పనిచేస్తుందని డాక్టర్ చిన్ చెప్పుకొచ్చారు.
ఈ కండోమ్‌ను రెగ్యులర్ కండోమ్ తరహాలో మహిళలు, పురుషులు ఎవరైనా వాడవచ్చని, జననాంగాలతో పాటు సమీప శరీరభాగానికీ ఇది అదనపు రక్షణ ఇస్తుందని తెలిపారు. రెండు కండోమ్‌లతో కూడిన వండలీఫ్ బాక్స్ ఖరీదు దాదాపు రూ 250 వరకూ ఉంటుంది. ఈ కండోమ్‌పై పలు పరీక్షలు, క్లినికల్ రీసెర్చ్ జరిగిన అనంతరమే దీన్ని యూనిసెక్స్ కండోమ్గా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి కంపెనీ వెబ్సైట్ ద్వారా ఈ కండోమ్ సేల్స్ ప్రారంభమవుతాయి. అవాంఛిత గర్భం, లైంగిక వ్యాధుల నుంచి ఈ కండోమ్ రక్షణ ఇస్తుందని డాక్టర్ చిన్ తెలిపారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Condom
- Health news
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

