Good Bacteria | పేగుల్లో మంచి బ్యాక్టీరియా కేవలం జీర్ణ వ్యవస్థకే కాదు, వీటికి కూడా అవసరమే..!
ఇప్పటికే చాలా మందికి ప్రోటీన్ తీసుకోవడం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఎక్కువ కాలరీలు తీసుకోవడం కండరాల పెరుగుదలకు ముఖ్యమని తెలుసు. అయితే, ఇటీవల జరిగిన ఒక అధ్యయనం కండరాల శక్తి, శారీరక పనితీరును ప్రభావితం చేసే మరో ముఖ్య అంశాన్ని గుర్తించింది.
Good Bacteria | ఇప్పటికే చాలా మందికి ప్రోటీన్ తీసుకోవడం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఎక్కువ కాలరీలు తీసుకోవడం కండరాల పెరుగుదలకు ముఖ్యమని తెలుసు. అయితే, ఇటీవల జరిగిన ఒక అధ్యయనం కండరాల శక్తి, శారీరక పనితీరును ప్రభావితం చేసే మరో ముఖ్య అంశాన్ని గుర్తించింది. పేగుల్లో ఉండే ఒక ప్రత్యేకమైన మంచి బ్యాక్టీరియా కండరాల బలం పెంచడంలో నేరుగా సహాయపడుతుందని ఈ పరిశోధన వెల్లడించింది. ఇది గట్-మసిల్ యాక్సిస్ అనే కొత్త భావనకు బలమైన ఆధారాలను అందిస్తోంది. అంటే పేగులలోని సూక్ష్మజీవుల వాతావరణం కండరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. గట్-మసిల్ యాక్సిస్ అనేది జీర్ణవ్యవస్థ (గాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్), కండరాల మధ్య ఉండే ద్విముఖ సంబంధం. పేగుల ఆరోగ్యం కండరాల పరిమాణం, పనితీరును ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో శారీరక వ్యాయామం కూడా పేగులలోని మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది.
పెరిగిన కండరాల పనితీరు..
గట్ అనే జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం రోసిబ్యూరియా ఇనులినివోరాన్స్ (Roseburia inulinivorans) అనే మంచి బ్యాక్టీరియా కండరాల పనితీరుకు సహజ బూస్టర్లా పనిచేస్తుందని వెల్లడైంది. ఇది కేవలం ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా, కండరాలు నిర్మాణం అయ్యేందుకు, సమర్థవంతంగా పనిచేయడానికి సంకేతాలు పంపుతుంది. ఇక ఈ పరిశోధనల్లో కొన్ని ముఖ్యాంశాలను కూడా పరిశోధకులు గుర్తించారు. వృద్ధుల్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నవారికి హ్యాండ్గ్రిప్ శక్తి దాదాపు 30 శాతం ఎక్కువగా కనిపించిందని గుర్తించారు. యువతలో ఈ బ్యాక్టీరియా శక్తి మాత్రమే కాకుండా స్టామినా పెరుగుదలతో కూడా సంబంధం కలిగి ఉంది. ఎలుకలపై చేసిన పరీక్షల్లో ఈ బ్యాక్టీరియా ఇచ్చిన గ్రూప్లో గ్రిప్ శక్తి 30 శాతం పెరిగింది. మనుషుల్లో కూడా ఈ బ్యాక్టీరియా అధికంగా ఉన్నవారికి లెగ్ ప్రెస్, బెంచ్ ప్రెస్ వంటి వ్యాయామాల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయి.
కండరాలకు శక్తిని ఇస్తుంది..
ఇక ఈ బ్యాక్టీరియా శరీరంలో అమినో ఆమ్లాల వినియోగాన్ని మార్చుతుంది. ఇది కండరాలకు అవసరమైన శక్తి మార్గాలను యాక్టివేట్ చేసి, కండర కణాలు అధిక శక్తిని ఉత్పత్తి చేసుకునేలా సహాయపడుతుంది. సాదారణంగా చెప్పాలంటే ఇది కండరాలకు ఇంధనం అందించే విధానాన్ని మెరుగుపరుస్తుంది. పేగుల్లో లక్షల కోట్ల సూక్ష్మజీవులు (మైక్రోబయోమ్) ఉంటాయి. వీటిలో రోసిబ్యూరియా వంటి మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నవారు, వ్యాయామం తక్కువ చేసినా కూడా సహజంగా బలంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
పేగుల ఆరోగ్యం మెరుగైతే..
పేగుల ఆరోగ్యం మెరుగైతే కండరాల శక్తి కూడా మెరుగవుతుంది. అందుకే కొన్ని అలవాట్లు పాటించడం ద్వారా గట్ మసిల్ యాక్సిస్ను మెరుగుపరుచుకోవచ్చు. దీని కోసం ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది మైక్రోబయోమ్ వైవిధ్యాన్ని పెంచుతుంది. ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఆహారంలో చేర్చాలి. ఇవి పేగుల సమతుల్యతను మెరుగుపరుస్తాయి. ఈ పరిశోధన ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. కండరాల పెరుగుదల కేవలం ప్రోటీన్ షేక్స్ లేదా బరువులు ఎత్తడంపైనే ఆధారపడదు. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ కూడా కండరాల బలం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- good bacteria
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

