Aspirin | దాదాపు వందేండ్ల నుంచీ వినియోగిస్తున్న ఆ ఔషధం మంచిదేనా?
యాస్పిరిన్.. దాదాపు వందేండ్ల నుంచీ వినియోగిస్తున్న ఔషధం. నొప్పి నుంచి ఉపశమనం మొదలు గుండె రక్తనాళాల ఆరోగ్యం వరకు వైద్యశాస్త్రంలో యాస్పిరిన్ ప్రాధాన్యం చాలా ఎక్కువ.
Aspirin | యాస్పిరిన్.. దాదాపు వందేండ్ల నుంచీ వినియోగిస్తున్న ఔషధం. నొప్పి నుంచి ఉపశమనం మొదలు గుండె రక్తనాళాల ఆరోగ్యం వరకు వైద్యశాస్త్రంలో యాస్పిరిన్ ప్రాధాన్యం చాలా ఎక్కువ.
- గుండెపోటుకు ప్రధాన కారణం.. రక్తనాళాల్లో రక్తం అకస్మాత్తుగా గడ్డకట్టుకు పోవడం. యాస్పిరిన్ రక్తాన్ని పలుచగా చేస్తుంది.
- రోగి ఆరోగ్య అవసరాలను బట్టి యాస్పిరిన్ ఎంత తీసుకోవాలనేది నిపుణులు సిఫారసు చేస్తారు. సొంత వైద్యం పనికిరాదు.
- గతంలో స్టెంట్లు వేయించుకున్నవారు, బైపాస్ చేయించుకున్నవారు సహా గుండె సమస్యలు ఉన్న ఎవరైనా చికిత్స ప్రణాళికలో యాస్పిరిన్ను భాగం చేసుకోవాల్సిందే. కాకపోతే నిపుణుల సలహా తప్పనిసరి.
- క్రమం తప్పని వ్యాయామం, గుండెకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారంతోపాటు యాస్పిరిన్నూ వాడితే.. అది కొలెస్ట్రాల్ బ్లాకేజీలను అడ్డుకోవడంలో, మరోమారు గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది.
- మధుమేహ రోగుల్లో గుండె కవాట వ్యాధుల నివారణలో కూడా యాస్పిరిన్ కీలకపాత్ర పోషిస్తుంది. అధిక రక్తపోటు, అధిక
కొలెస్ట్రాల్ ఉన్నవారి విషయంలోనూ యాస్పిరిన్ ఆ ముప్పు మూలాలను అడ్డుకోగలదు. - ఎన్ని ప్రయోజనాలున్నా యాస్పిరిన్ అందరికీ సరిపడదు. పొట్టలో అల్సర్లు ఉన్నవారు, రక్తంలో ప్లేట్లెట్లు
తక్కువగా ఉన్నవారు, రక్తస్రావం సమస్య ఉన్నవారు, ప్రత్యేకించి యాస్పిరిన్ అంటే అలర్జీ ఉన్నవారు.. ఆ గోళీకి దూరంగా ఉండాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

