Arthritis | వింటర్లో ఆర్ధరైటిస్ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే..!
చలికాలంలో ఆర్ధరైటిస్‌తో (Arthritis) బాధపడేవారు వ్యాధి లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. చల్లని వాతావరణంతో నొప్పి, వాపు, కీళ్లు గట్టిపడటం వంటి సమస్యలు తీవ్రమవుతాయి.
న్యూఢిల్లీ : చలికాలంలో ఆర్ధరైటిస్‌తో (Arthritis) బాధపడేవారు వ్యాధి లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. చల్లని వాతావరణంతో నొప్పి, వాపు, కీళ్లు గట్టిపడటం వంటి సమస్యలు తీవ్రమవుతాయి. వింటర్లో ఉదయం లేవగానే చాలామంది మార్నింగ్ సిక్నెస్ ఎదుర్కొంటారని, లేవగానే వారి చేతులు వెంటనే పనిచేయకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తుతాయని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, గురుగ్రాంకు చెందిన రుమటాలజిస్ట్ డాక్టర్ నావల్ మెండిరట చెబుతున్నారు.
ఇక ఆర్ధరైటిస్‌తో బాధపడేవారు వింటర్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. చలికాలంలో శరీరం వేడిగా ఉండేలా చూసుకోవాలి. శరీరమంతా కవర్ అయ్యే డ్రస్‌లతో పాటు, తుపాకీ, గ్లోవ్స్, స్కార్వ్స్ వంటి శరీరాన్ని వేడిగా ఉంచే యాక్సెసరీస్ ధరించాలి. ఎలక్ట్రిక్ హీటింగ్ ప్యాడ్స్, బ్లాంకెట్స్ వాడుతూ వేడినీళ్ల స్నానం చేస్తుండాలి.
హాట్ బాత్‌తో కీళ్ల స్టిఫ్నెస్ కూడా తగ్గుతుంది. ఇక చలికాలంలో బద్ధకించి శారీరక వ్యాయామాన్ని వాయిదా వేయడం సరైంది కాదు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా శరీరం ఫ్లెక్సిబిలిటీ కలిగిఉండటంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.ఆర్ధరైటిస్ నియంత్రణకూ శారీరక వ్యాయామం పనిచేస్తుంది. ఇక ఇండోర్ వ్యాయామాలు శరీర ఉష్ణోగ్రతను పెంచడంతో పాటు కీళ్ల వాపు, నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి.రోజూ తగినంత నీరు తీసుకోవడం, పోషకాహారం, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆర్ధరైటిస్ లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Read More :
Nayanthara Chakravarthy | గ్లామర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నయనతార చక్రవర్తి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Arthritis
- health tips
- pain
- winter
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

