Diwali 2023 : హెల్ధీ స్వీట్స్‌తో పండగ చేసుకోండిలా..!
దీపాల పండగ దివాళీకి (Diwali 2023) కౌంట్‌డౌన్ షురూ కావడంతో పండుగ ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. దివాళీ అంటే పండుగ కోలాహలం అంతాఇంతా కాదు.
న్యూఢిల్లీ : దీపాల పండగ దివాళీకి (Diwali 2023) కౌంట్‌డౌన్ షురూ కావడంతో పండుగ ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. దివాళీ అంటే పండుగ కోలాహలం అంతాఇంతా కాదు. బాణాసంచా మోతలతో పాటు బంధుమిత్రుల రాకతో ఇండ్లన్నీ సందడిగా మారుతుంటాయి. ఇక గెట్ టూ గెదర్లు, దివాళీ పార్టీల హడావిడి మామూలే. పండగ రోజుల్లో స్వీట్స్, దేశీ స్నాక్స్‌ను పలువురు ఇష్టంగా లాగించేస్తుంటారు. అయితే అధిక క్యాలరీలు, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తీసుకోకుండా ఆరోగ్యకర ప్రత్యామ్నాయాలతో పండగ వంటకాలను ఆస్వాదించవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
డెజెర్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని లేకుంటే హై క్యాలరీ ఆహరంతో పలు అనారోగ్య సమస్యలు వెంటాడతాయని హెచ్చరిస్తున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలతో దివాళీ స్వీట్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఖీర్, షిర్ఖండ్ వంటి పాలతో చేసిన డెజెర్ట్స్ తీసుకోవడం మేలని చెబుతున్నారు. హై క్వాలిటీ ప్రొటీన్‌తో కూడిన పాలతో చేసిన డెజెర్ట్స్తో తక్షణ శక్తిని పొందవచ్చు. ఇక షుగర్ స్ధానంలో డేట్స్, కిస్మిస్, తాజా పండ్లతో పాటు కొద్దిమోతాదులో బెల్లం, తేనెను వాడవచ్చు.
కాజు కట్లి స్ధానంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే బాదం కట్లిని ఎంచుకోవచ్చు. రవ్వ లడ్డుకు బదులు ప్రొటీన్ అధికంగా ఉండే శనగపిండితో చేసిన లడ్డూ, వేరుశనగ లడ్డూను తీసుకోవచ్చు. కొబ్బరి లడ్డు స్ధానంలో ప్రొటీన్ అధికంగా ఉండే మైసూర్ పాక్‌ను ఎంచుకోవచ్చు. ఇక బయట స్వీట్ షాప్స్‌లో స్వీట్స్‌ను కొనుగోలు చేయకుండా ఇంట్లోనే తయారు చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఎన్ని స్వీట్స్ ఏ రూపంలో తీసుకున్నా మితంగా ఉండేలా చూసుకుంటూ పండగను ఆస్వాదించాలని చెబుతున్నారు.
Read More :
School Teacher | మద్యం, గంజాయి ఇచ్చి విద్యార్థితో శృంగారం.. టీచర్ అరెస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

