ఎగ్ ఫ్రీజింగ్ అంటే?
కడుపులో ఉన్న అండాలను బయటికి తీసి, అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిలువ ఉంచడాన్ని ‘ఎగ్ ఫ్రీజింగ్' అంటారు. ‘క్రయో ఫ్రీజింగ్' అని కూడా వ్యవహరిస్తారు. తల్లి కడుపులో ఉండగానే ఆడపిల్లలకు అండాలు తయారవుతాయి.
ఎగ్ ఫ్రీజింగ్ గురించి తరచూ వార్తల్లో వింటూ ఉంటాం. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి? ఎలాంటి వాళ్లకు ఉపయోగపడుతుంది?
- ఓ పాఠకురాలు
కడుపులో ఉన్న అండాలను బయటికి తీసి, అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిలువ ఉంచడాన్ని ‘ఎగ్ ఫ్రీజింగ్’ అంటారు. ‘క్రయో ఫ్రీజింగ్’ అని కూడా వ్యవహరిస్తారు. తల్లి కడుపులో ఉండగానే ఆడపిల్లలకు అండాలు తయారవుతాయి. అంటే పుట్టుకతోనే ఆడపిల్ల కడుపులో అండాలు ఉంటాయి. ఆ సంఖ్య కూడా పుట్టుకతో ఉన్నదే తప్పించి, ఆ తర్వాత అధికం కావడం అంటూ ఉండదు. అయితే, పాపాయి జన్మించినప్పుడు సుమారు 20 లక్షల అండాలు ఉంటే, రజస్వల సమయానికి సుమారు అరవై వేలకు పడిపోతుంది. చాలా అండాలు వాటికవే చనిపోతాయి. మిగిలిన అండాల్లోంచి కూడా.. బయటికి విడుదల అయ్యేందుకు ప్రతినెలా సుమారు 300 అండాలు పోటీ పడతాయి. అందులో అన్నిటికంటే బలమైన అండమే అంతిమంగా విడుదల అవుతుంది. మిగతావన్నీ వృథా అయినట్టే. అలా ఏండ్లు గడుస్తున్న కొద్దీ, అంటే ఆడవాళ్లకు ముప్పై అయిదేండ్లు దాటుతున్న కొద్దీ అండాల్లో నాణ్యత తగ్గిపోతూ వస్తుంది.
మగవాళ్లలో మాత్రం.. ఇందుకు విరుద్ధంగా ఎప్పటికప్పుడు వీర్యం తయారవుతూ ఉంటుంది. అంటే, వయసు ఎక్కువ ఉన్న అండాన్ని చురుకైన శుక్రకణం కలవడం వల్ల జన్యుపరమైన సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. ఈ ఇబ్బందిని తప్పించుకునేందుకు కొందరు చిన్న వయసులోనే అండాలను దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఇంజెక్షన్ ఇచ్చి.. ఒకేసారి ఎక్కువ అండాలు మెచ్యూర్ అయ్యేలా చేస్తారు. అలా మెచ్యూర్ అయిన అండాలను సేకరించి అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద భద్రపరుస్తారు. వీటిని ఐవీఎఫ్లాంటి పద్ధతుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫలదీకరణం చెందించి బిడ్డను పొందవచ్చని ఆలోచన.
మరో విధానంలో మెచ్యూర్ కాని సాధారణ అండాలను కూడా అండాశయం నుంచి సేకరించి పెడతారు. ఇన్విట్రోమెచ్యురేషన్ (ఐవీఎమ్) పద్ధతిలో వీటిని కూడా ఫలదీకరణం చెందించే అవకాశం ఉంది. అయితే ఇలా దాచిన అండాల ద్వారా బిడ్డలు పుడతారని వందశాతం కచ్చితంగా చెప్పలేం. రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కూడా. పైగా ఖరీదైనది. న్యాయపరంగానూ రాతకోతలు అవసరమవుతాయి. గర్భాశయ క్యాన్సర్లు సహా వివిధ క్యాన్సర్ల బారిన పడి కీమోథెరపీ అవసరమైన వాళ్ల నుంచి అండాలను సేకరించి తర్వాతి కాలంలో అయినా మాతృత్వాన్ని ప్రసాదించాలన్న ఉద్దేశంతో ఎగ్ ఫ్రీజింగ్ విధానాన్ని ప్రారంభించారు. అయితే, కెరీర్ మహిళలు ఇప్పుడు బిడ్డల్ని కనే ఉద్దేశం లేదనీ, మున్ముందు ఉపయోగపడతాయనీ అండాలను
దాచడానికి మొగ్గు చూపుతున్నారు. ఇది కాస్త కొత్త పోకడే!
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

