Ear Piercing | చెవులు కుట్టిస్తున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
Ear Piercing | పిల్లలకు చెవి కుట్టించడం సంప్రదాయం. పెద్దలు కుట్టించుకోవడం ఫ్యాషన్. దేనికైనా రెండే మార్గాలు.. తరాలనాటి పద్ధతి, ఆధునికమైన గన్‌షాట్. దేని ప్రత్యేకతలు దానివే. దేని పరిమితులు దానివే. గన్‌షాట్ పద్ధతిలో నొప్పి ఉండదు కాబట్టి, చాలామంది అటువైపే మొగ్గు చూపుతారు. ముఖ్యంగా, పసిపిల్లలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
Ear Piercing | పిల్లలకు చెవి కుట్టించడం సంప్రదాయం. పెద్దలు కుట్టించుకోవడం ఫ్యాషన్. దేనికైనా రెండే మార్గాలు.. తరాలనాటి పద్ధతి, ఆధునికమైన గన్‌షాట్. దేని ప్రత్యేకతలు దానివే. దేని పరిమితులు దానివే. గన్‌షాట్ పద్ధతిలో నొప్పి ఉండదు కాబట్టి, చాలామంది అటువైపే మొగ్గు చూపుతారు. ముఖ్యంగా, పసిపిల్లలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ చాలా సందర్భాల్లో ముక్కు, చెవులు కుట్టేవారు కనీస పరిశుభ్రత కూడా పాటించడం లేదనేది వైద్యుల ఫిర్యాదు. కుట్టేముందు సూదిని, గన్ను స్టెరిలైజ్ చేయాలి. చేతులకు గ్లోవ్స్ వేసుకోవాలి. కుట్టించుకున్నవారు కూడా చెవి, ముక్కు భాగాలను అపరిశుభ్రమైన చేతులతో ముట్టుకోరాదు.
ముఖ్యంగా చెవి కుట్టిన తర్వాత.. ఆ వైపుగా తలపెట్టి పడుకోకూడదు. దీనివల్ల దిండులో పోగైన బ్యాక్టీరియా చెవిపై దాడి చేస్తుంది. చెవి మీద తీవ్ర ఒత్తిడి పడుతుంది. వాపు, గాయం ఎక్కువగా ఉన్నప్పుడు పసుపు పూసుకుంటే సరిపోతుందనో, ఆకు పసరుతో మానిపోతుందనో అనుకోకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఓ వయసు వచ్చాక.. కొందరిని మధుమేహం లాంటి సమస్యలు బాధించవచ్చు. దీనివల్ల గాయాలు మానడం కష్టం. అలాంటివారు కుట్టాల్సిన అవసరం లేకుండానే చెవులకు, ముక్కుకు అలంకరించుకునే నగలను ఎంచుకోవడం ఉత్తమం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Childrens
- ear
- Ear Piercing
- fashion
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

