Health Tips | 83 ఏండ్ల వయసులో వర్కవుట్లు : డైట్ సీక్రెట్స్ వెల్లడించిన డాక్టర్
Health Tips : 83 ఏండ్ల ట్రైఅథ్లెట్, పిట్స్బర్గ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో న్యూరోసర్జన్ డాక్టర్ జోసెఫ్ మరూన్ తన ఫిట్నెస్ సీక్రెట్స్ వెల్లడించారు. తన సుదీర్ఘ ఆరోగ్యకర జీవితానికి సహకరించిన ఆహార నియమాల గురించి ఆయన వివరించారు.
Health Tips : 83 ఏండ్ల ట్రైఅథ్లెట్, పిట్స్బర్గ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో న్యూరోసర్జన్ డాక్టర్ జోసెఫ్ మరూన్ తన ఫిట్నెస్ సీక్రెట్స్ వెల్లడించారు. తన సుదీర్ఘ ఆరోగ్యకర జీవితానికి సహకరించిన ఆహార నియమాల గురించి ఆయన వివరించారు. 40 ఏండ్ల వయసులో తాను ఊబకాయంతో బాధపడేవాడినని, ఫాస్ట్‌ఫుడ్ అధికంగా తీసుకుంటూ వ్యాయామం చేసేవాడిని కాదని చెప్పుకొచ్చారు.
ఆ వయసులో తాను తన జీవనశైలిని మార్చుకుని రన్నింగ్, వ్యాయామం, ఆరోగ్యకర ఆహారం తీసుకునేలా ట్రాన్స్ఫామ్ అయ్యానని గుర్తుచేసుకున్నారు. స్విమ్మింగ్, సైక్లింగ్, ఎక్కువదూరం రన్నింగ్‌తో కూడిన ట్రైథ్లాన్లో ఛాంపియన్‌గా డాక్టర్ జోసెఫ్ మరూన్ పలుమార్లు నిలిచారు. మధ్యదరా ఆహారాన్ని తాను అనుసరించేవాడినని చెప్పారు. మొక్కల ఆధారిత ఆహారాలు, తృణధాన్యాలు, చేపలు, రెడ్‌మీట్ వంటి ఆరోగ్యకర కొవ్వులతో కూడిన ఆహారం తీసుకుంటానని అన్నారు.
ఈ ఆహారం హృద్రోగాలు, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి తీవ్ర అనారోగ్యాల బారినపడే ముప్పును తగ్గిస్తుంది. ఆరోగ్యకర ఆహారం తీసుకోవడంతో పాటు క్యాన్సర్, డిమెన్షియా, హృద్రోగాలకు దారితీసే ప్రాసెస్డ్ ఆహారాలకు దూరం కావాలని డాక్టర్ జోసెఫ్ సూచిస్తున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను పెంచే ట్రాన్స్ఫ్యాట్స్ను మానివేయాలని, మధుమేహం, హృద్రోగాలు, కిడ్నీ వ్యాధులు, అల్జీమర్స్ ముప్పును పెంచే చక్కెరను మితంగా తీసుకోవాలని డాక్టర్ జోసెఫ్ చెబుతున్నారు.
Read More :
Salt substitutes | సాల్ట్ ప్రత్యామ్నాయాలతో హైబీపీ ముప్పునకు చెక్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

