Salt substitutes | సాల్ట్ ప్రత్యామ్నాయాలతో హైబీపీ ముప్పునకు చెక్
Salt substitutes : ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిని వేధిస్తున్న హైపర్‌టెన్షన్‌తో హృద్రోగ సమస్యలు, ఇతర తీవ్ర అనారోగ్యాల బారినపడుతూ ఏటా 1.8 కోట్ల మంది మృత్యువాతన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక స్పష్టం చేస్తోంది.
Salt substitutes : ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిని వేధిస్తున్న హైపర్‌టెన్షన్‌తో హృద్రోగ సమస్యలు, ఇతర తీవ్ర అనారోగ్యాల బారినపడుతూ ఏటా 1.8 కోట్ల మంది మృత్యువాతన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక స్పష్టం చేస్తోంది. ఉప్పు వాడకం తగ్గిస్తే ఈ మరణాలను చాలావరకూ నియంత్రించవచ్చని డబ్ల్యూహెచ్‌వో ఎప్పటినుంచో చెబుతూవస్తోంది.
సాధారణ ఉప్పుకు బదులు సాల్ట్ ప్రత్యామ్నాయాలను వాడితే లోబీపీ ముప్పు లేకుండా పెద్దల్లో అధిక రక్తపోటు ముప్పు తగ్గిస్తుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. సాధారణ ఉప్పు వాడేవారితో పోలిస్తే ప్రత్యామ్నాయ ఉప్పును వాడేవారిలో హైపర్‌టెన్షన్, అధిక రక్తపోటుకు దారితీయడం 40 శాతం తక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది.
ఈ అధ్యయనంలో ఉప్పునకు ప్రత్యామ్నాయం వాడిన వారిలో సోడియంకు బదులు ఇతర పోషకాలు, పొటాషియం, నిమ్మరసం, ఇతర ఔషధ పదార్ధాలు వాడారు. సాల్ట్ ప్రత్యామ్నాయాలుగా వెల్లుల్లి, మిరియాల పొడి, ఆనియన్ పౌడర్, అల్లం, దాల్చినచెక్క వంటి మసాలా దినుసులు వాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉప్పును పూర్తిగా మానివేయడం కంటే సరైన బీపీని కలిగిఉండేందుకు సాల్ట్ ప్రత్యామ్నాయాలు సమర్ధవంతంగా పనిచేస్తాయని అధ్యయనం తెలిపింది.సోడియం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రజలు శ్రద్ధ వహించాలని అధ్యయన రచయిత డాక్టర్ యాంగ్ఫెంగ్ వూ పేర్కొన్నారు.
Read More :
Reward | నేరస్థుడిపై 50 పైసలు రివార్డు.. విషయం వింతగా ఉంది కదా..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

