Raw Papaya | పచ్చి బొప్పాయిని తింటే ఎన్ని అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా..? వెంటనే తినడం ప్రారంభిస్తారు..!
బొప్పాయి పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. బొప్పాయి పండ్లను అందరూ ఇష్టంగా తింటుంటారు. ఈ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి.
Raw Papaya | బొప్పాయి పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. బొప్పాయి పండ్లను అందరూ ఇష్టంగా తింటుంటారు. ఈ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. అనేక పోషకాలను అందిస్తాయి. వీటిని తింటే పలు వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు. అయితే బొప్పాయి పండ్లు మాత్రమే కాదు, పచ్చి బొప్పాయి కాయలను కూడా మనం తినవచ్చు. వీటిని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన ప్రజలు వివిధ రకాల వంటకాల్లోనూ వేస్తుంటారు. పచ్చి బొప్పాయిని తినడం వల్ల కూడా మనకు అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి కూడా వ్యాధులను నయం చేయడంలో సహాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో ఉండే పోషకాలు మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి.
జీర్ణ సమస్యలకు..
పచ్చి బొప్పాయిలో పపైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు చెందిన ఎంజైమ్. అందువల్ల పచ్చి బొప్పాయిని తింటే పపైన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది పండిన బొప్పాయి కన్నా పచ్చి బొప్పాయిలోనే అధికంగా ఉంటుంది. కనుక పచ్చి బొప్పాయిని తింటే మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. మనం తిన్న ఆహారాల్లో ఉండే ప్రోటీన్లను జీర్ణం చేయడంలో పపైన్ ఎంతో సహాయం చేస్తుంది. కొందరు చికెన్, మటన్ వంటివి వండినప్పుడు త్వరగా ఉడకాలని, మెత్తగా ఉండాలని చెప్పి పచ్చి బొప్పాయి ముక్కలను కూడా కూరల్లో వేస్తుంటారు. దీని వల్ల మాంసం త్వరగా ఉడికి సుతిమెత్తగా ఉంటుంది. అలాంటి మాంసాన్ని తింటే తేలిగ్గా జీర్ణమవుతుంది. అజీర్తి ఏర్పడదు. కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడంలోనూ పచ్చి బొప్పాయి ఎంతో సహాయం చేస్తుంది. పచ్చి బొప్పాయిని తినడం వల్ల అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గుండె ఆరోగ్యానికి..
పచ్చి బొప్పాయిలో ఉండే పపైన్, కైమో పపైన్ అనే ఎంజైమ్‌లు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను సైతం కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తింటే శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. గుండె కండరాలు, రక్త నాళాల వాపులు తగ్గుతాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. పచ్చి బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటి వల్ల పచ్చి బొప్పాయిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. పచ్చి బొప్పాయిని తింటే కొవ్వు మెటబాలిజం పెరుగుతుంది. కొవ్వు వేగంగా ఖర్చవుతుంది. దీంతో బరువు తగ్గుతారు. కనుక బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది.
రోగ నిరోధక శక్తికి..
పచ్చి బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. దీని వల్ల సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పచ్చి బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు చర్మాన్ని సంరక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే పిగ్మెంటేషన్ సైతం తగ్గిపోతుంది. పచ్చి బొప్పాయిని తింటే మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గిపోతాయి. ఇలా పచ్చిబొప్పాయి మనకు ఎంతో మేలు చేస్తుంది. ఇక దీన్ని ఎలా తినాలి.. అని చాలా మంది సందేహిస్తుంటారు. దీనికి పోషకాహార నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారంటే.. పచ్చి బొప్పాయిని సాధారణ బొప్పాయిలా నేరుగా తినలేం. కానీ పచ్చి బొప్పాయిని ఉడకబెట్టి లేదా ఇతర కూరల్లో కలిపి వండుకుని తినవచ్చు. ఇలా తింటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- raw papaya
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

