కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..!
Health tips | కిడ్నీలు..! మన దేహంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో ఇవి కూడా ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించి శుభ్రంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. మన శరీరం
కిడ్నీలు..! మన దేహంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో ఇవి కూడా ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించి శుభ్రంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు మలినాలు తొలగిపోవాలి. మలినాలు తొలగిపోవాలంటే కిడ్నీల పనితీరు బాగుండాలి. లేదంటే శరీరం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. అందుకే అలాంటి పరిస్థితి తలెత్తకూడదంటే కొన్ని ఆహార నియామాలు పాటించాలి. మరి అవేంటో తెలుసుకుందామా..
1. వెల్లుల్లి
వెల్లుల్లిని మూత్రపిండాల రక్షణకు మంచి ఆహారంగా చెప్పవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్లాటింగ్ కణాలు ఉండటంవల్ల చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
2. బెర్రీస్
బెర్రీస్ వివిధ రంగుల్లో లభ్యమవుతాయి. వాటిలో బ్లాక్‌బెర్రీ మినహా మిగతా అన్ని రకాల బెర్రీలు కిడ్నీలకు మేలు చేసేవే. స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్, బ్లూబెర్రీస్ అన్నింటిలోనూ న్యూట్రియంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరి క్వాలిటీస్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే అవి వ్యాధి నిరోధకతను పెంచి బ్లాడర్ ఫంక్షన్స్ సక్రమంగా ఉండేందుకు దోహదపడుతాయి.
3. మొలకెత్తిన విత్తనాలు
శనగలు, పెసర్లు లాంటి ధాన్యాలను తరచూ మొలకెత్తించి తినడంవల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలోని ఫైబర్ శరీరంలోని మలినాలను తనతో కలుపుకుని విసర్జితమవుతుంది. అందువల్ల మూత్రపిండాలు శుభ్రపడి కిడ్నీల్లో రాళ్ల సమస్య రాకుండా ఉంటుంది.
4. క్యాబేజీ
క్యాబేజీ మూత్రపిండాల పనితీరును మెరుగుపర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. సాధారణంగా క్యాబేజీని కిడ్నీల డ్యామేజ్‌ను అరికట్టే సహజ ఔషధంగా వినియోగిస్తారు.
5. ఉల్లిపాయ
ఉల్లిపాయలు కిడ్నీల్లో రాళ్లను తొలగించడానికి తోడ్పడుతాయి. అంతేగాక, మూత్రపిండాలను నిర్విషీకరణ చేయడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

