First Aid Kit | మీ దగ్గర ప్రథమ చికిత్స కిట్ ఉందా?
First Aid Kit | ఇంట్లో కూరగాయలు కోస్తున్నప్పుడో, తోటపని చేస్తున్నప్పుడో గాయాలకు ఆస్కారం ఉంటుంది. పిల్లలైతే ఆటల్లో దెబ్బలు తగిలించుకుంటారు. పనికి వెళ్లే వాళ్లకు కూడా చిన్నా పెద్దా ప్రమాదాల ముప్పు ఉంటుంది. అయితే, చిన్నచిన్న గాయాలకు ఇంట్లోనే ప్రథమ చికిత్స చేసుకోవచ్చు.
First Aid Kit | ఇంట్లో కూరగాయలు కోస్తున్నప్పుడో, తోటపని చేస్తున్నప్పుడో గాయాలకు ఆస్కారం ఉంటుంది. పిల్లలైతే ఆటల్లో దెబ్బలు తగిలించుకుంటారు. పనికి వెళ్లే వాళ్లకు కూడా చిన్నా పెద్దా ప్రమాదాల ముప్పు ఉంటుంది. అయితే, చిన్నచిన్న గాయాలకు ఇంట్లోనే ప్రథమ చికిత్స చేసుకోవచ్చు. ఒకవేళ సమస్య పెద్దదైనా దవాఖానకు వెళ్లడానికి ముందు ప్రథమ చికిత్స అవసరం పడొచ్చు. కాబట్టి ప్రతి ఇంట్లో కనీసం ఒక నమ్మకమైన ప్రాథమిక చికిత్స కిట్ తప్పకుండా ఉండాలి. ఆ కిట్‌లో ఉండాల్సిన వస్తువులేంటో చూద్దాం..
యాస్పిరిన్: అకస్మాత్తుగా ఛాతీ పట్టేసి.. గుండెపోటు అని అనుమానం వచ్చినప్పుడు.. తొలి గంటలోపే రెండు 81 మి. గ్రా యాస్పిరిన్ మాత్రలు ఇస్తే.. సంజీవనిలా పనిచేస్తాయి. అయితే, డాక్టర్‌ను కనీసం ఫోన్లో సంప్రదించి, ఆయన సూచనల మేరకే తీసుకోవాలి.
డిస్పోజబుల్ నాన్-లేటెక్స్ గ్లవ్స్: గాయాలైనవారికి సాయం చేయాల్సి వచ్చినప్పుడు వీటిని ధరించడం సురక్షితం.

శానిటైజర్: గాయాలకు చికిత్స సమయంలో నీళ్లతో చేతులు కడుక్కునే అవకాశం లేకపోతే, శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. అంతేకాదు గ్లవ్స్ తొడుక్కునే ముందుకూడా చేతులు కడుక్కోవడమో, శానిటైజ్ చేసుకోవడమో మంచిది.
యాంటీసెప్టిక్ వైప్స్: పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో లేనప్పుడు గాయాలను తుడవడానికి యాంటీ సెప్టిక్ వైప్స్ అనువుగా ఉంటాయి. ఆ తర్వాతే గాయాలకు ఆయింట్మెంట్ పూయడం, బ్యాండేజీ వేయడం చేయాలి.

యాంటీబ్యాక్టీరియల్ ఆయింట్మెంట్: దీంతో చిన్న గాయాలపై బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. అయితే గాయాలను కడిగిన తర్వాతే ఆయింట్మెంట్ వాడాలి.
హైడ్రోకార్టిసన్ క్రీం: ఇది క్రిమికీటకాలు, మొక్కల వల్ల వచ్చే దురద నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అబ్డామినల్ డ్రెసింగ్స్: ఇవి పెద్ద గాయాల వల్ల రక్తస్రావాన్ని నివారిస్తాయి.
వాటర్‌ప్రూఫ్ అడ్హెసివ్ టేప్: కట్టు గట్టిగా ఉండటానికి ఉపకరిస్తుంది.
సెల్ఫ్-అడ్హెసివ్ బ్యాండేజెస్: చిన్న గాయాలకు పట్టీవేయడానికి బాగుంటాయి.
త్రికోణాకార బ్యాండేజీ: మోచేతిని, భుజాన్ని కలిపి ఉంచడానికి వాడతారు.
ఇన్స్టంట్ ఐస్ బ్యాగ్స్: నొప్పి, వాపు నివారించడానికి వాడుకోవచ్చు.

కత్తెర: బ్యాండేజీలు, బట్టలు కత్తిరించడానికి వీలుగా నాణ్యమైన కత్తెరను దగ్గర ఉంచుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ విషయానికొస్తే ట్రామా షియర్స్ అనే ప్రత్యేకమైన కత్తెర వాడటం మంచిది.
సీపీఆర్ ఫేస్ షీల్డ్: అత్యవసర పరిస్థితుల్లో రోగికి శ్వాస అందించడానికి అక్కరకు వస్తాయి.
బర్న్ హైడ్రోజెల్: కాలిన గాయాలను చల్లటి నీళ్లతో కడగడం సాధ్యపడనప్పుడు బర్న్ హైడ్రోజెల్ పూయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

మర్చిపోవద్దు…
☞ ఈ మందులు, పరికరాలను వాటర్‌ప్రూఫ్ సంచిలో గానీ, గాలి చొరబడని పారదర్శకమైన డబ్బాల్లో గానీ ఉంచుకోవాలి. దీంతో బయటికి కనిపిస్తుంటాయి. గందరగోళం ఉండదు.
☞ ముందు జాగ్రత్త కిట్‌లోని మందులు, ఆయింట్మెంట్ల ఎక్స్పైరీ తేదీలను చూసుకోవాలి. డేట్ అయిపోయినవి వాడకూడదు.
☞ ప్రథమ చికిత్సలో ఎక్కడైనా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటే తప్పక మీ పేరు నమోదు చేసుకోండి.
☞ మీ వాహనాల్లో కూడా ప్రథమ చికిత్స కిట్ ఉంచుకోండి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు నిలపవచ్చు.
☞ గాయాలు పెద్దవైనా, పది నిమిషాలు అదిమిపెట్టినా కూడా రక్తస్రావం ఆగకపోయినా, శ్వాస సమస్యలు ఉన్నా.. తక్షణం దగ్గర్లోని దవాఖానకు వెళ్లండి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

