డిప్రెషన్..
ఓ పెనుభూతం. మన లోపలే తిష్ట వేసుకొని మనసును పీడించే శత్రువు. అది తీవ్రరూపం దాలిస్తే ఒక్కోసారి మందులూ, కౌన్సెలింగ్ కూడా పనిచేయవు. కానీ, ఇప్పుడు కుంగుబాటు నుంచి ఉపశమనం కలిగించే చిట్కా తెలిసింది. శారీరక శ్రమ చేస్తే కనుక, డిప్రెషన్ లక్షణాలు నెమ్మదిస్తాయని తేల్చారు జర్మనీ పరిశోధకులు.
డిప్రెషన్లో ఉన్నపుడు ఎవ్వరినీ కలవాలని అనిపించదు. ఏ పనీ చేయబుద్ధి కాదు. దేని గురించి ఆలోచించినా ప్రతికూల భావనలే స్ఫురిస్తాయి. అంతేకాదు! డిప్రెషన్‌తో సతమతమయ్యేవారు మార్పునకు సిద్ధంగా ఉండరు. అందుకు విరుద్ధంగా శారీరక శ్రమ కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నదట. మెదడు పని
తీరులో ముఖ్యమైన న్యూరాన్లు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా శరీర శ్రమ తోడ్పడుతున్నదని తేలింది. జర్మనీలోని పరిశోధకులు డిప్రెషన్‌తో బాధపడే 41 మంది మీద ప్రయోగాలు చేసిన తర్వాత తేల్చిన ఫలితమిది.