కేర్ గివర్..ఆరోగ్యం జాగ్రత్త!
ఆరోగ్యరంగంలో ఎన్నో గొప్ప మార్పులు వస్తున్నాయి. జీవన ప్రమాణాలు పెరగడంతో ఆయుర్దాయం అధికమైంది. దీంతో, కుటుంబ సభ్యుల వృద్ధాప్య సమస్యలు ఇంట్లోని ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతున్నాయి. ఎవరో ఒకరు ‘కేర్ గివర్'గా మారాల్సి వస్తున్నది. ఆ బాధ్యత సహజంగానే కొంత ఒత్తిడి పెంచుతున్నది, ప్రతికూల ప్రభావాలకూ కారణం అవుతున్నది. దీన్నే ‘కేర్ గివర్ బర్డన్' అంటారు.
ఆరోగ్యరంగంలో ఎన్నో గొప్ప మార్పులు వస్తున్నాయి. జీవన ప్రమాణాలు పెరగడంతో ఆయుర్దాయం అధికమైంది. దీంతో, కుటుంబ సభ్యుల వృద్ధాప్య సమస్యలు ఇంట్లోని ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతున్నాయి. ఎవరో ఒకరు ‘కేర్ గివర్’గా మారాల్సి వస్తున్నది. ఆ బాధ్యత సహజంగానే కొంత ఒత్తిడి పెంచుతున్నది, ప్రతికూల ప్రభావాలకూ కారణం అవుతున్నది. దీన్నే ‘కేర్ గివర్ బర్డన్’ అంటారు.
దీర్ఘకాలం జబ్బుపడి కదలలేని స్థితికి చేరు కున్నవారికి, పండుముసలి వ్యక్తులకు అవసరమైన సేవలు అందించడం కుటుంబ బాధ్యత. ఎవరో ఒకరు తలకెత్తుకోవాల్సిందే. ఆర్థిక పరిస్థితులు, కెరీర్ పరుగులు ఆ కేర్ గివర్పై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. కాబట్టి, ఆ వ్యక్తి తమ ఆత్మీయుడిని సంరక్షిస్తూనే తన ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే, రోగి ఆలనా పాలనా చూస్తున్నప్పుడు కంటినిండా కునుకు ఉండదు. రోగి నిద్రలోకి జారుకున్న తర్వాతే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఏ కారణంతో అయినా నిద్రపట్టకపోతే కేర్ గివర్కు జాగరణే. నిద్రలేమి వల్ల చికాకు పెరుగుతుంది. చిన్నచిన్న విషయాలకే కోప గించుకుంటారు. కుంగుబాటు, నిరాశ తదితర లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు రోగులపైనా అరిచేస్తారు. హద్దులు మీరిన ఆవేశంలో చేయి చేసుకునేవారూ ఉన్నారు. కాబట్టి, ఆ సమయంలో మనసు మీద నియంత్రణ చాలా అవసరం. అంతేకాదు, రోగితో తిని పించడమేకాదు, తానూ తగినంత పోషకాహారం తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. అభిరుచులకు సమయం కేటాయించాలి. అప్పుడప్పుడూ రోగిని పునరావాస కేంద్రాలలోనూ ఉంచవచ్చు. దీనివల్ల కేర్ గివర్కు కొంత విశ్రాంతి లభిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- caregiver
- health sector
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

