Health Tips | మీకు ఈ అలవాట్లు ఉన్నాయా.. అయితే చిన్న వయసులోనే పళ్లు ఊడిపోవచ్చు!
Health Tips | పళ్లను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. మనం చేసే చిన్నపాటి పొరపాట్లు, మనకున్న చెడు అలవాట్లు దంతాల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
Health Tips | పళ్లను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. మనం చేసే చిన్నపాటి పొరపాట్లు, మనకున్న చెడు అలవాట్లు దంతాల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
- కొందరికి ఐస్ ముక్కలు కొరికే అలవాటు ఉంటుంది. మంచుగడ్డలు రాళ్లకంటే బలమైనవి. ఫలితంగా పళ్లు విరిగిపోనూవచ్చు. ఆ చల్లదనం, పళ్ల లోపలి భాగాన్ని కూడా దెబ్బతీస్తుంది.
- కాఫీ, టీలలోని క్షారత్వం వల్ల పళ్ల మీద మరకలు ఏర్పడతాయి. సూక్ష్మక్రిములు పెరిగేందుకూ ఇవి సాయపడతాయి. ఫలితంగా చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన లాంటి సమస్యలు వస్తాయి. అందుకే కాఫీ, టీ తాగిన కాసేపటికి నోరు పుక్కిలించాలి.
- నిమ్మరసం లాంటి పుల్లటి ద్రవాల వల్ల ఎసిడిటీ రావచ్చు. అది పంటి ఎనామిల్ (పైపొర)ను దెబ్బతీస్తుంది. ఇలాంటి పానీయాలు తీసుకున్న తర్వాత చూయింగ్ గమ్ నమిలితే కొంత ఉపశమనం లభిస్తుంది.
- తినగానే బ్రష్ చేసుకోవడం చాలామందికి అలవాటు. ఆ మాత్రం జాగ్రత్త మంచిదే కానీ, తిన్న ముప్పై నిమిషాల వరకూ ఆగితే మేలు.
- గోళ్లు కొరుక్కునే అలవాటు పళ్ల ఆకృతిని దెబ్బతీస్తుంది. అంతేకాదు, దవడ ఎముకలను కూడా ప్రభావితం చేస్తుంది.
.. బాగా అరిగిపోయిన తర్వాత కూడా టూత్ బ్రష్ మార్చకపోవడం, కూల్డ్రింక్స్ అతిగా తీసుకోవడం, నిద్రలో పళ్లు కొరకడం తదితర అలవాట్లూ మంచివి కాదు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

