న్యూఢిల్లీ : కొత్తిమీర లేని దేశీ వంటకాలను ఊహించలేం. ఆహార పదార్ధాల్లో రుచిని పెంచే కొత్తిమీరతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించి మధుమేహ ముప్పును నివారిస్తుంది.
థైరాయిడ్ వ్యాధుల నుంచి కూడా కొత్తిమీర ఆకులు, విత్తనాలు ఉపశమనం కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎండోక్రైన్ గ్రంధి థైరాయిడ్ హార్మోన్ల స్థితిగతులు, జీవక్రియలను నియంత్రిస్తుంది. వ్యక్తి శరీరంలోని హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడితే థైరాయిడ్ సమస్యలు చుట్టుముడతాయి.
థైరాయిడ్ సమస్యల నుంచి బయటపడేందుకు కొత్తిమీర ఉపయోగపడుతుందని చెబుతున్నారు. థైరాయిడ్ రోగులకు కొత్తిమీర ఎంతో మేలు చేస్తుందని న్యూట్రిషనిస్ట్, క్లినికల్ డైటీషియన్ ప్రాచీ షా చెబుతున్నారు. కొత్తిమీరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు థైరాయిడ్ వంటి వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడతాయి. ఇంకా కొత్తిమీరను తరచూ తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడంతో పాటు, బరువు తగ్గడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ప్రాచీ షా పేర్కొన్నారు.