Cool Drinks Health Risks | తరచూ కూల్ డ్రింక్స్‌ను తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే..?
మీరు కూల్ డ్రింక్స్‌ను తరచూ తాగుతున్నారా.. వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు ఈ డ్రింక్స్‌ను తాగుతుంటారా.. అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. అవును, ఎందుకంటే ఇలా కూల్ డ్రింక్స్‌ను తరచూ తాగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గిపోతుందని, ఎముకలు బలహీనంగా మారి విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది.
Cool Drinks Health Risks | మీరు కూల్ డ్రింక్స్‌ను తరచూ తాగుతున్నారా.. వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు ఈ డ్రింక్స్‌ను తాగుతుంటారా.. అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. అవును, ఎందుకంటే ఇలా కూల్ డ్రింక్స్‌ను తరచూ తాగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గిపోతుందని, ఎముకలు బలహీనంగా మారి విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. కూల్ డ్రింక్స్ మనకు అనేక విధాలుగా హాని చేస్తాయని, ముఖ్యంగా వీటి వల్ల ఎముకలు బలహీనంగా మారిపోతాయని సైంటిస్టులు అంటున్నారు.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌కు చెంఎదిన పరిశోధకులు 7 ఏళ్ల పాటు అధ్యయనం చేసి ఈ వివరాలను వెల్లడించారు. తరచూ కూల్ డ్రింక్స్ తాగేవారి ఎముకలు త్వరగా విరిగిపోయే అవకాశాలు ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోనూ ఈ వివరాలను ప్రచురించారు. అయితే ఈ సమస్య మహిళల్లో మరింత ఎక్కువగా ఉంటుందని వారు అంటున్నారు. కనుక మహిళలు అసలు కూల్ డ్రింక్స్‌ను తాగకపోవడమే మంచిదని వారు సూచిస్తున్నారు.
ఈ రెండు సమ్మేళనాల శాతం ఎక్కువ..
కూల్ డ్రింక్స్‌లో రెండు సమ్మేళనాల శాతం ఎక్కువగా ఉంటుంది. కెఫీన్, ఫాస్ఫారిక్ యాసిడ్లు కూల్ డ్రింక్స్‌లో ఎక్కువగా ఉంటాయి. కెఫీన్ వల్ల మన శరీరం క్యాల్షియంను శోషించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇక ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల రక్తంలో ఉండే క్యాల్షియం మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఇలా ఈ రెండు సమ్మేళనాలు చేటు చేస్తాయి. ఇవి రెండూ కూల్ డ్రింక్స్‌లో ఎక్కువగా ఉంటాయి. కనుక కూల్ డ్రింక్స్‌ను తాగితే శరీరానికి అసలు క్యాల్షియం లభించదు. ఫలితంగా ఎముకలు బలహీనంగా మారిపోతాయి. ఎముకలు విరిగిపోయే చాన్స్ ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు.
మహిళలు, యువత..
మెనోపాజ్ అనంతరం మహిళలల్లో క్యాల్షియం శోషించుకునే రేటు క్రమంగా తగ్గిపోతుంది. అలాంటప్పుడు కూల్ డ్రింక్స్ తాగితే శరీరానికి క్యాల్షియం అసలు ఏమాత్రం లభించదు. దీంతో మహిళల్లో ఎముకలు విరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే టీనేజ్ లో ఉన్నవారికి ఎముకల నిర్మాణం కోసం క్యాల్షియం అవసరం. కానీ కూల్ డ్రింక్స్‌ను అధికంగా తాగితే క్యాల్షియం లభించదు. దీంతో వారిలో నిర్మాణం ఆగిపోతుంది. దీంతోపాటు ఎముకలు బలహీనంగా మారుతాయి. కనుక మహిళలు, యువత, టీనేజ్‌లో ఉన్నవారు కూల్ డ్రింక్స్‌ను తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, వాటిని అసలు తాగకపోవడమే మంచిదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్త పడాల్సిందే..
ఇక కూల్ డ్రింక్స్‌లో చక్కెర కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల కూల్ డ్రింక్స్‌ను తాగితే శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. ఫలితంగా ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఈ మూత్రంతోపాటు క్యాల్షియం కూడా బయటకు పోతుంది. దీంతో శరీరానికి క్యాల్షియం లభించక ఎముకలు బలహీనంగా మారుతాయి. కనుక ఎలా చూసినా కూడా కూల్ డ్రింక్స్ వల్ల మనకు నష్టమే తప్ప అసలు ఏమాత్రం లాభం ఉండదు. కాబట్టి కూల్ డ్రింక్స్‌ను తరచూ తాగుతున్నవారు ఇకనైనా జాగ్రత్త పడాల్సిందేనని డాక్టర్లు సైతం సూచిస్తున్నారు.
క్యాల్షియం తక్కువగా ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు క్యాల్షియం ట్యాబ్లెట్లను వాడవచ్చు. అలాగే పాలు, గుడ్లు, జీడిపప్పు, బాదం వంటి ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల కూడా క్యాల్షియం లభిస్తుంది. వారంలో రెండు సార్లు నువ్వులతో చేసిన చిక్కిలను తినాలి. దీంతో కూడా క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. దీంతో ఎముకలు బలంగా తయారవుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- cool drinks
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

