ఆటలమ్మ వస్తే.. అంతే సంగతులా?
డాక్టర్ గారూ నమస్తే. నేను త్వరలో అమ్మను కాబోతున్నాను. చాలామంది చికెన్ పాక్స్ గురించి భయపెడుతున్నారు. ఈ సమస్య ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది
డాక్టర్ గారూ నమస్తే. నేను త్వరలో అమ్మను కాబోతున్నాను. చాలామంది చికెన్ పాక్స్ గురించి
భయపెడుతున్నారు. ఈ సమస్య ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? – ఓ పాఠకురాలు
చికెన్ పాక్స్‌ను కొన్ని ప్రాంతాల్లో ‘ఆటలమ్మవారు’, ‘చిన్నమ్మవారు’ అంటారు. మూఢనమ్మకాలతో వైద్యం చేయించకపోతే ఇతర సమస్యలు కూడా వస్తాయి. కొన్నిసార్లు బిడ్డ మరణించే ప్రమాదమూ ఉంది. చికెన్ పాక్స్ ‘వారిసెల్లా జోస్టర్’ అనే వైరస్ వల్ల దాపురిస్తుంది. ప్రథమ దశలో అలసట, తలనొప్పి, చికాకు, ఆకలి తగ్గడం, కీళ్ల నొప్పులు, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఛాతీపై పొక్కులు ఆరంభమై.. ముఖం, తల, నోరు, చెవులు, కాళ్లు, చేతులకు వ్యాపిస్తాయి. అయిదు నుంచి ఆరు రోజుల తర్వాత ఎండిపోతాయి. మరో రెండు వారాలకు పొక్కులు రాలిపోతాయి. ఆ తర్వాత కనిపించే ముదుగు రంగు మచ్చలు తగ్గడానికి కొంత సమయం పడుతుంది. పొక్కులలో చీము చేరడం, న్యుమోనియా, మెదడువాపు, గర్భిణులలో అబార్షన్లు, గర్భస్థ శిశు మరణాలు సంభవిస్తాయి. గర్భం దాల్చిన మూడు నెలలలోపు వస్తే శిశువుకు పుట్టుకతో అంగవైకల్యం ఉండవచ్చు. ప్రసవానికి అయిదు రోజుల ముందు లేదా ప్రసవానంతరం రెండు రోజులకు వస్తే శిశువు మరణించవచ్చు. వ్యాధి తీవ్రంగా ఉంటే, హాస్పిటల్లోనే ఉంచి వైద్యం చేయించాల్సిన అవసరం ఉంది.
వ్యాప్తి
చికెన్ పాక్స్ సంవత్సరమంతా తక్కువ స్థాయిలో ఉంటూ.. మార్చి నుంచి జూన్ వరకు తరచుగా వస్తుంది. టీకా వేయించకపోతే ఏదో ఒక వయసులో ప్రతి ఒక్కరికీ వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తుల తుమ్ము, దగ్గు ద్వారా.. దగ్గరగా ఉండే వారికి సోకుతుంది. చికెన్ పాక్స్ టీకా మొదటి డోసు 15 నెలల వయసులో, రెండో డోసు 3 నెలల తర్వాత ఇవ్వాలి. 12 ఏండ్లు దాటిన వారికి కనీసం 4 వారాల వ్యత్యాసంతో రెండుసార్లు ఇప్పించాలి. అంతకుముందు ఒకే డోసు తీసుకున్న 12 ఏండ్ల లోపు పిల్లలకు రెండో డోసు ఇప్పించాలి. టీకాలు తీసుకున్న 1-4 శాతం పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు తక్కువ తీవ్రతగల వ్యాధి రావచ్చు. దీన్ని ‘బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్’ అంటారు. రెండో డోసు చాలా వరకు నివారిస్తుంది.
– డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు సికింద్రాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

