Diabetes | ఆరేండ్ల చిన్నారులకు మధుమేహం వస్తుందా ? వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Diabetes | రకరకాల కారణాలతో చిన్నపిల్లలకు కూడా మధుమేహం రావచ్చు. మధుమేహం రెండు రకాలు. టైప్ వన్ డయాబెటిస్, టైప్ టు డయాబెటిస్. పిల్లల్లో చాలావరకు టైప్ వన్ డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తుంటాయి. డాక్టర్ సిఫారసు ప్రకారం ఇన్సులిన్ ఇవ్వడమే దీనికి పరిష్కారం.
Diabetes | మా పాప వయసు ఆరేండ్లు. తరచూ మూత్రానికి వెళ్తుంది. నీళ్లు బాగా తాగుతుంది. నీరసంగా ఉంటున్నది. ఈ లక్షణాలను బట్టి, డయాబెటిస్ కావచ్చని అంటున్నారు. ఇది నిజమేనా? ఇంతచిన్న వయసులో మధుమేహం వస్తుందా?
- ఓ పాఠకురాలు
రకరకాల కారణాలతో చిన్నపిల్లలకు కూడా మధుమేహం రావచ్చు. మధుమేహం రెండు రకాలు. టైప్ వన్ డయాబెటిస్, టైప్ టు డయాబెటిస్. పిల్లల్లో చాలావరకు టైప్ వన్ డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తుంటాయి. డాక్టర్ సిఫారసు ప్రకారం ఇన్సులిన్ ఇవ్వడమే దీనికి పరిష్కారం. భోజనం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన పోషకాహారం ఇవ్వాలి. నిత్య వ్యాయామమూ అవసరమే. ఇలాంటివారు జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అతిసున్నితమైన సిరంజీలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి, పెద్దగా నొప్పి అనిపించదు.
పిల్లలకు మధుమేహం ఉన్న విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాలి. దీనివల్ల, ఇన్సులిన్ హెచ్చుతగ్గుల ప్రభావంతో వచ్చే హైపోైగ్లెసీమియా తదితర వ్యాధుల లక్షణాలను గమనించినప్పుడు మన దృష్టికి తీసుకొస్తారు. అదే సమయంలో పిల్లలకు ఆరోగ్యకర జీవనశైలిని పరిచయం చేయాలి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మధుమేహం ఉన్న పిల్లలు కూడా మిగిలిన వారిలా సాధారణ జీవితం గడపడం సాధ్యమే. తక్షణం మీరు పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి చికిత్స ప్రారంభించండి. అదే తగ్గిపోతుందనే నిర్లిప్తతతోనో, చిట్కా వైద్యంతోనో ఇన్సులిన్ ఇవ్వడంలో అజాగ్రత్త వహిస్తే.. డయాబెటిస్ కీటోఎసిడోసిస్ లాంటి ప్రాణాంతక సమస్యలూ ఎదురుకావచ్చు.
– డాక్టర్ విజయానంద్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

