Bones weak | 60 ఏళ్లు దాటితే ఎముకలు బలహీనం.. వయసుకు తగ్గ చికిత్స మేలు
Bones weak | ప్రతి మనిషి వయసు పెరుగుతున్నా కొద్దీ శరీరంలో కాల్షియం( Calcium,) తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు (Bones) బలహీనపడడంతో పాటు పటుత్వం కోల్పోతాయని వైద్య నిపుణులు అంటున్నారు.
ప్రతి మనిషి వయసు పెరుగుతున్నా కొద్దీ శరీరంలో కాల్షియం( Calcium,) తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు (Bones) బలహీనపడడంతో పాటు పటుత్వం కోల్పోతాయని వైద్య నిపుణులు అంటున్నారు. తుంటినొప్పి, తుంటి విరగడం వంటి సమస్యలకు రోగి వయసు, సమస్యకు గల కారణాల ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. సాధారణ తుంటి నొప్పి సమస్యను ‘హిప్ ప్రిజర్వేషన్’ చికిత్సతో నివారించవచ్చునని ఆర్థో వైద్య నిపుణులు తెలిపారు. సకాలంలో గుర్తించకపోతే వ్యాధి ముదిరి తుంటి మార్పిడి శస్త్ర చికిత్సకు దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా తుంటి నొప్పి సమస్యకు పెయిన్‌కిల్లర్ (Painkillers) మందులు, ఫిజియోథెరపీ (Physiotherapy) రెండో స్టేజిలో కోర్ డి కంప్రెషర్ వంటి చికిత్సలు నిర్వహిస్తారు. అప్పటికీ సమస్య తీరకపోతే తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరపాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే సాధారణ చికిత్సకు అడ్వాన్స్డ్ చికిత్సగా ‘హిప్ ప్రీజర్వేషన్’తో తుంటి సమస్యను పరిష్కరించవచ్చని వైద్యులు పేర్కొన్నారు.
హిప్ ప్రిజర్వేషన్ అంటే ..

తుంటి జాయింట్ అనేది బాల్, సాకెట్ రూపంలో ఉండి, మనిషి కూర్చోవడం, నిలబడటం, పరుగెత్తడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాధాన్యమైన తుంటిని సంరక్షించుకోవాలంటే సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి ‘ హిప్ ప్రిజర్వేషన్’ (Hip preservation treatment) చికిత్స చేయించుకోవడం ఉత్తమం. హిప్ ప్రిజర్వేషన్ చికిత్స చేయించుకోవడం ఉత్తమం. హిప్ సమస్యను గుర్తించి ఏ కారణం చేత నొప్పి వచ్చిందో తెలుసుకొని ఆ భాగంలో ఉన్న ఎముకను సరిచేసి తుంటిని సంరక్షించడం. ఈ చికిత్స వల్ల సమస్యను అక్కడికక్కడే నిలవరించి నయం చేయవచ్చు. ఇది అన్ని వయసుల వారిలో సాధ్యం కాకపోవచ్చు.

ముఖ్యంగా 50 నుంచి 60 ఏండ్లు పైబడిన వారిలో తుంటి ఎముక ఫ్రాక్చర్‌కు గురైతే సరిచేయడం సాధ్యం కాదు. వారిలో హిప్ రీప్లేస్మెంట్ ఒక్కడే మార్గమమని వైద్యులు సూచిస్తున్నారు. 30 ఏండ్ల లోపు వారికి హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అయినపుడు స్క్రూస్తో ఫిక్స్ చేయవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

