White Pepper | తెల్ల మిరియాలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
తెల్ల మిరియాలు, నల్ల మిరియాలు ఒకే మొక్కనుంచి వస్తాయి. వీటిని శుద్ధి చేయడంలోనే తేడా ఉంటుంది. మిరియాలు పండిన తర్వాత వాటిని కోసి ఎండబెట్టి నల్ల మిరియాలను సేకరిస్తారు. తెల్ల మిరియాలనైతే ఎండబెట్టక ముందు లేదా ఆ తర్వాత పైపొట్టును తీసి తయారుచేస్తారు. పైగా నల్ల మిరియాల కంటే తెల్ల మిరియాలు పరిమళభరితంగా ఉంటాయి.
White Pepper | తెల్ల మిరియాలు, నల్ల మిరియాలు ఒకే మొక్కనుంచి వస్తాయి. వీటిని శుద్ధి చేయడంలోనే తేడా ఉంటుంది. మిరియాలు పండిన తర్వాత వాటిని కోసి ఎండబెట్టి నల్ల మిరియాలను సేకరిస్తారు. తెల్ల మిరియాలనైతే ఎండబెట్టక ముందు లేదా ఆ తర్వాత పైపొట్టును తీసి తయారుచేస్తారు. పైగా నల్ల మిరియాల కంటే తెల్ల మిరియాలు పరిమళభరితంగా ఉంటాయి. కానీ, నల్ల వాటితో పోలిస్తే తొందరగా చేదెక్కుతాయి. తెల్ల మిరియాలను అంతగా రంగులేని వంటకాల్లో ఉపయోగిస్తారు. ఈ సంప్రదాయం ఫ్రెంచి పాకశాలలో మొదలైంది. అక్కడినుంచి ప్రపంచమంతా వ్యాపించింది. ఇప్పుడు చైనీస్, వియత్నామీస్ సూపుల్లో, స్వీడిష్ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తెల్ల మిరియాల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
బాధా నివారిణి
తెల్ల మిరియాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీంతో శరీరంలో ఏ అవయవంలోనొప్పి ఉన్నా వెంటనే ఉపశమనం దొరుకుతుంది.
కీళ్లనొప్పులలో
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారికి తెల్ల మిరియాల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మేలుచేస్తాయి. అన్ని రకాల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి.
శ్వాస సమస్యల్లో
తెల్ల మిరియాలలోని పెక్టిక్ శాకరైడ్లు, ఆలిగో శాకరైడ్లు జలుబు, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యల నివారణలో సహాయకారిగా పనిచేస్తాయి.
అరుగుదలలో
తెల్ల మిరియాలలో సిమెటిడైన్ ఉంటుంది. ఇది పొట్టలో ఆమ్లం ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. తిన్న ఆహారం తేలికగా అరగడానికి ఉపకరిస్తుంది. అయితే పొట్టలో సహజంగా ఉత్పత్తి అయ్యే హిస్టమిన్‌తో పోలిస్తే తెల్ల మిరియాలు 40 రెట్లు తక్కువ ప్రభావవంతం.
తలనొప్పికి ఔషధం
పరిమళ భరితమైన తెల్ల మిరియాల్లో పైపరైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది తలనొప్పి, పార్శపునొప్పిని అడ్డుకుంటుంది.
ముందు జాగ్రత్తలు
- తెల్ల మిరియాలను ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంట పుడుతుంది.
- అల్సర్లు, గ్యాస్ట్రయిటిస్, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లుఅతిగా తీసుకోకూడదు.
- చిన్నపిల్లలు వీటిని నేరుగా తినకూడదు.
- తెల్ల మిరియాల్లో ఉండే పైపరైన్ రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదింపజేస్తుంది. కాబట్టి, రక్త రుగ్మతలు ఉన్నవాళ్లు కూడా మితంగానే వాడాలి.
- గర్భిణులు కూడా పరిమితంగానే తీసుకోవాలి. ఇవి వేడిచేస్తాయి కాబట్టి, కడుపులో పిండానికి ప్రమాదకరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Black pepper
- Piper nigrum
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

