Health Tips : దేశీ స్నాక్స్ మంచి ఫ్లేవర్‌తో పాటు పలు వెరైటీల్లో కోరుకున్న రుచుల్లో లభిస్తాయి. రకరకాల ఫుడ్ ఆప్షన్లు ఉన్నా ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్‌ను ఎంపికచేసుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా మధుమేహులకు సరైన స్నాక్స్ ఎంచుకోవడం కష్టం. అయితే ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండే ఆహార పదార్ధాలను మధుమేహులు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తూనే శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆహార పదార్ధాలను ఎంపిక చేసుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తూ, సరైన పోషకాలతో కూడిన ఐదు సులభమైన స్నాక్స్‌ను పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా చిక్పీ ఛాట్ ఎంతో టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది.
శనగలతో చాట్ మసాలా తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ నిలకడగా ఉండటంతో పాటు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇందులో ఆనియన్స్, టమాట, కీరా దోస, స్వీట్ కార్న్ వంటివి అవసరమైన పోషకాలను, యాంటీఆక్సిడెంట్స్‌ను అందించడమే కాకుండా చాట్‌ను లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేలా చేస్తాయి. ఇక వెజిటబుల్ ఉప్మా, స్ప్రౌటెడ్ మూంగ్ సలాడ్, స్టఫ్డ్ బెల్‌పెప్పర్స్, ఫ్లాక్స్ సీడ్స్‌తో కుకుంబర్ రైతా వంటి స్నాక్స్‌ను తీసుకోవచ్చు.
Read More :
Titanic | 6 కోట్లకు అమ్ముడు పోయింది.. టైటానిక్ తలుపునకు రికార్డు ధర