Health Tips | జపనీయుల డైట్‌తో ఫ్యాటీ లివర్ వ్యాధి నియంత్రణ
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆహారంగా జపనీయుల డైట్ (Health Tips) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పలు వ్యాధుల నియంత్రణతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను జపాన్ డైట్ అందిస్తుందని చెబుతుంటారు.
న్యూఢిల్లీ : అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆహారంగా జపనీయుల డైట్ (Health Tips) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పలు వ్యాధుల నియంత్రణతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను జపాన్ డైట్ అందిస్తుందని చెబుతుంటారు. ఈ ఆహారం ద్వారా ప్రజలు ఫ్యాటీ లివర్ వ్యాధికి దూరంగా ఉండవచ్చని పోషకాహార నిపుణులు పేర్కొంది. పోషకాహార లోపంతో పాటు చురుకైన జీవన శైలి లోపించడంతో ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ప్రజలు ఫ్యాటీ లివర్ డిసీజ్ బారినపడుతున్నారు.
జపనీయుల తరహా ఆహారం తీసుకుంటే సహజసిద్ధంగా లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తాజా కూరగాయలు, పప్పుధాన్యాలతో కూడిన సమతులాహారంతో పాటు తక్కువ మోతాదులో తినడం జపనీయుల డైట్ ప్లాన్‌లో కీలకమని చెబుతున్నారు. తక్కువ మోతాదులో జపనీయులు మైండ్‌ఫుల్ ఈటింగ్‌కు ప్రాధాన్యత ఇస్తారు. వారు తమ కడుపు 80 శాతం నిండగానే ఆహారం తీసుకోవడం నిలిపివేస్తారు. ఈ విధానం ఫ్యాటీ లివర్ డిసీజ్ ముప్పును నియంత్రించడమే కాకుండా అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.
జపనీయులు అధికంగా కూరగాయలు తీసుకుంటారు. వీటిలో విటమిన్లు, మినరల్స్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో లివర్‌లో కొవ్వును నియంత్రిస్తాయి. రైస్, బార్లీ, ఓట్స్ వంటి ధాన్యాలు అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు కరుగుతుంది. ఇక జపనీయులు ఆరోగ్యానికి మేలు చేసే గ్రీన్‌టీని అధికంగా సేవించడంతో పాటు షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్‌ను తక్కువగా తీసుకుంటారు.
Read More
Telangana | దస్కా సాత్.. తెలంగాణ దావత్!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

