డాక్టర్ గారూ నమస్తే. నేను ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాను. రోజూ పదికిలోమీటర్లు ప్రయాణించి ఆఫీసుకు వెళ్తాను. సీట్లో కూర్చునేసరికి జాకెట్ తడిచిపోయినట్టు ఉంటుంది. చంకల్లో విపరీతమైన చెమట. దాంతోపాటు దుర్వాసన. నాకే కాదు, చుట్టుపక్కల వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?
ఈ ఇబ్బందిని హైపర్హైడ్రోసిస్ అంటారు. చాలామందిలో కనిపించే సమస్యే. మీ విషయంలో కొంత తీవ్రంగా ఉంది. దీనివల్ల ఆత్మ విశ్వాసం దెబ్బతింటుంది. నలుగురిలోకి వెళ్లడానికి మొహమాట పడతారు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలు, ఔషధాల ప్రభావం కూడా ఓ కారణం కావచ్చు. ఈ సమస్యను ప్రాథమిక స్థాయిలోనే తప్పించుకోడానికి కొన్ని మార్గాలున్నాయి. అల్లం, వెల్లుల్లి, క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ తగ్గించాలి. అలా అని పూర్తిగా మానేస్తే పోషక విలువల్ని కోల్పోతాం. మద్యం, రెడ్ మీట్ కూడా ఓ కారణమే. మసాలా దినుసులను దూరం పెట్టడం ఉత్తమం.
– డాక్టర్ అనున్యా రెడ్డి కాస్మటిక్ సర్జన్ ఇ.ఎన్.టి సర్జన్, ఎలర్జీ స్పెషలిస్ట్