Atlantic Diet | లేటెస్ట్ డైట్ ప్లాన్ : అట్లాంటిక్ డైట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు
Atlantic Diet | మరో లేటెస్ట్ డైట్ ఇప్పుడు ఇంటర్నెట్లో మార్మోగుతోంది. అట్లాంటిక్ డైట్ ఆరోగ్యానికి ప్రయోజనకరమని ప్రపంచవ్యాప్తంగా పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
Atlantic Diet | మరో లేటెస్ట్ డైట్ ఇప్పుడు ఇంటర్నెట్లో మార్మోగుతోంది. అట్లాంటిక్ డైట్ ఆరోగ్యానికి ప్రయోజనకరమని ప్రపంచవ్యాప్తంగా పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారంగా పేరొందిన మధ్యప్రాచ్య ఆహారానికి అట్లాంటిక్ డైట్ దగ్గరగా ఉంటుంది. అట్లాంటిక్ డైట్ బరువు తగ్గేందుకు సహాయపడటంతో పాటు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను ప్రేరేపిస్తుంది.
అట్లాంటిక్ డైట్ వీటితో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుందని చెబుతున్నారు. ఈ డైట్ ఆరోగ్యానికి ఎలా మేలుచేస్తుందనే వివరాలను జామా నెట్వర్క్ ఓపెన్‌లో ప్రచురితమైన అథ్యయనం వెల్లడించింది. స్పెయిన్‌లో అట్లాంటిక్ డైట్ ప్లాన్‌ను అనుసరించే 200 కుటుంబాలపై ఈ అధ్యయనం నిర్వహించారు.
ఆరు నెలల అనంతరం వీరిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడంతో పాటు బీపీ, ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్, శరీర బరువు సరిగ్గా ఉన్నాయని గుర్తించారు. ఈ డైట్ ప్లాన్‌ను అనుసరించే వారిలో మెటబాలిక్ సిండ్రోమ్ తలెత్తే అవకాశాలు తగ్గాయని పరిశోధకులు వెల్లడించారు. ఇక అట్లాంటిక్ డైట్లో భాగంగా స్ధానికంగా లభించే పండ్లు, కూరగాయలు, సిరిల్స్, ఫిష్, డైరీ ఉత్పత్తులు, ఆలివ్ ఆయిల్‌తో పాటు పరిమిత మోతాదులో వైన్ కూడా తీసుకుంటారు. సీజనల్, స్ధానికంగా లభ్యమయ్యే పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకుంటూ తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకుంటారు.
Read More :
Pregnant women | గర్భిణీలు అలాంటి ఆహారం జోలికి అస్సలు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా..?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

