Ashwagandha | అశ్వగంధ.. ఓ అద్భుతమైన మూలిక.. ఇది అందించే ప్రయోజనాలు అమోఘం..
ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలు ఉన్నాయి. అవి అనేక ఔషధ విలువలను కలిగి ఉంటాయి. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వాటిల్లో అశ్వగంధ కూడా ఒకటి. దీని పేరు మీరు వినే ఉంటారు.
Ashwagandha | ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలు ఉన్నాయి. అవి అనేక ఔషధ విలువలను కలిగి ఉంటాయి. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వాటిల్లో అశ్వగంధ కూడా ఒకటి. దీని పేరు మీరు వినే ఉంటారు. అశ్వగంధనే ఇండియన్ జిన్సెంగ్ అని, వింటర్ చెర్రీ అని కూడా పిలుస్తారు. ఇది మనకు మార్కెట్లో ఎక్కువగా పొడి రూపంలో లభిస్తుంది. అశ్వగంధకు చెందిన వేర్లను పొడిగా తయారు చేసి మనకు విక్రయిస్తారు. దీన్ని రాత్రి పూట పాలలో కలిపి తాగాల్సి ఉంటుంది. అశ్వగంధ చూర్ణాన్ని రోజూ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. అనేక వ్యాధులను నయం చేసే శక్తి అశ్వగంధకు ఉందని వారు అంటున్నారు. అశ్వగంధ మనకు అనేక అద్భుతమైన లాభాలను అందిస్తుందని వారు చెబుతున్నారు.
ఒత్తిడి, ఆందోళనకు..
అశ్వగంధ ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నేటి తరుణంలో చాలా మంది నిత్యం ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు అశ్వగంధను వాడుతుంటే ప్రయోజనం ఉంటుంది. ఈ పొడిని తీసుకుంటే మైండ్ రిలాక్స్ అయి నిద్ర కూడా చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. అశ్వగంధ పొడిని తీసుకోవడం వల్ల శరీరం ఉత్సాహంగా మారుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రి పూట దీన్ని తీసుకుంటే మరుసటి రోజు మొత్తం ఉత్సాహంగా ఉంటారు.
పురుషుల శృంగార సామర్థ్యానికి..
శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారు కండరాల నొప్పుల బారిన పడుతుంటారు. అలాంటి వారు అశ్వగంధ చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే ఆయా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తిరిగి పనిచేసేందుకు కావల్సిన శక్తి శరీరానికి లభిస్తుంది. కండరాలు నిర్మాణమవుతాయి. దేహం చక్కని ఆకృతిని పొందుతుంది. అశ్వగంధను తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను మరింత ఎక్కువగా శోషించుకుంటాయి. దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం సైతం పెరుగుతుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం పోతుంది. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అశ్వగంధ పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది వారి జననావయవాలకు రక్త సరఫరా జరిగేలా చూస్తుంది. దీంతో శృంగారంపై ఆసక్తి పెరుగుతుంది. వీర్యం వృద్ది చెందుతుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.
మెదడు పనితీరుకు..
అశ్వగంధను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది. అశ్వగంధ యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఈ పొడిని తీసుకుంటే శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా అశ్వగంధ మేలు చేస్తుంది. దీన్ని తీసుకుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అశ్వగంధ పొడి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. దీని వల్ల సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇలా మనకు అశ్వగంధ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దీన్ని తీసుకునే ముందు డాక్టర్ సలహాను పాటించాలి. కొందరికి ఇది పడకపోవచ్చు. కనుక డాక్టర్ సలహా మేరకు దీన్ని వాడుకుంటే మంచి ఫలితాలను రాబట్టవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Ashwagandha
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

