Asafoetida for Digestive system | చిటికెడు ఇంగువ చాలు!

తినే ఆహారం ఎంత ముఖ్యమో, తిన్నది అరగడమూ అంతే అవసరం. కానీ చాలామందికి జీర్ణశక్తి తక్కువ. దీంతో అజీర్తి, పేగుల సమస్య, కడుపుబ్బరం.. మొదలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వీటిని నిరోధించే శక్తి ‘ఇంగువ’కు ఉంది.
గ్యాస్, అజీర్తి, మలబద్ధకం, ఊపిరితిత్తుల సమస్యలను నివారిస్తుంది ఇంగువ. సాధారణంగా శెనగలు, రాజ్మా మొదలైన పప్పు దినుసులు తిన్నప్పుడు గ్యాస్ ఏర్పడుతుంది. ఆయా వంటల్లో కాస్తంత ఇంగువ చిలకరిస్తే ఈ ఇబ్బంది ఉండదు. ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఇంకొందరికి సల్ఫర్ ఎక్కువగా ఉండే క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రకోలీ మొదలైన కూరగాయలు తిన్నప్పుడు ఎసిడిటీ సమస్యలు వస్తాయి. బయటి ఆహారం వల్లే గ్యాస్ సమస్య వస్తున్నదని చాలామంది అనుకుంటారు. నిజానికి ఇంట్లో కూడా జీర్ణశక్తిని పెంచే ఆహారం తినకపోవడంతో ఇలా జరుగుతుంది. కూర వండేటప్పుడు పోపులో ఇంగువ వేయడం అలవాటు చేసుకుంటే మంచిది. అలా కుదరకపోతే, భోజనం తర్వాత చిటికెడు ఇంగువను కప్పు నీళ్లలో కలిపి తాగొచ్చు. దీనివల్ల శ్వాసలో ఇబ్బంది నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

