Paneer | పనీర్‌ను తింటున్నారు సరే.. దాంతో కలిగే లాభాలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
బయటికి వెళ్లినప్పుడు చాలా మంది తినే ఆహారాల్లో పనీర్ కూడా ఒకటి. పనీర్‌తో అనేక రకాల వంటకాలను తయారు చేస్తారు. ఎక్కువగా మసాలా, రైస్ వంటకాలను పనీర్‌తో తయారు చేస్తారు. అయితే పనీర్‌ను మనం ఇంట్లోనూ పలు రకాలుగా వండుకోవచ్చు.
Paneer | బయటికి వెళ్లినప్పుడు చాలా మంది తినే ఆహారాల్లో పనీర్ కూడా ఒకటి. పనీర్‌తో అనేక రకాల వంటకాలను తయారు చేస్తారు. ఎక్కువగా మసాలా, రైస్ వంటకాలను పనీర్‌తో తయారు చేస్తారు. అయితే పనీర్‌ను మనం ఇంట్లోనూ పలు రకాలుగా వండుకోవచ్చు. ఇక పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం పనీర్ మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలను పనీర్ అందిస్తుంది. పనీర్‌ను తీసుకుంటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. మాంసాహారం తినలేని వారు పనీర్‌ను తింటే ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు. 100 గ్రాముల పనీర్ ద్వారా ఏకంగా 20 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు.
బరువు తగ్గేందుకు..
ప్రోటీన్లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. కండరాలు నిర్మాణం అయ్యేలా చేస్తాయి. దీంతో కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారు పనీర్ ను ఆహారంలో భాగం చేసుకుంటే కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు. కండరాలు నిర్మాణం అవుతాయి కనుక చక్కని దేహాకృతిని పొందుతారు. పనీర్‌ను తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. పనీర్‌లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పనీర్‌ను తింటే సుమారుగా 700 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం పొందవచ్చు. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేస్తుంది. అలాగే దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
డయాబెటిస్ నియంత్రణకు..
పనీర్‌లో ఉండే ఫాస్ఫరస్ ఎముకల్లో సాంద్రతను పెంచుతుంది. దీంతో ఎముకలు పటిష్టంగా మారుతాయి. పనీర్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అధిక బరువు ఉన్నవారు పనీర్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పనీర్‌ను తింటుంటే షుగర్ లెవల్స్ సైతం అదుపులో ఉంటాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. పనీర్ తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే షుగర్ లెవల్స్ అంత త్వరగా పెరగవు. పైగా ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు షుగర్ లెవల్స్‌ను తగ్గేలా చేస్తాయి. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
విటమిన్ బి12 పుష్కలంగా..
పనీర్‌లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా జింక్, విటమిన్లు ఎ, డి, బి12 అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ నుంచి బయట పడవచ్చు. పనీర్‌లో ఉండే విటమిన్ బి12 మెదడును యాక్టివ్‌గా మారుస్తుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. వెజిటేరియన్లు చాలా మందిలో విటమిన్ బి12 లోపం ఉంటుంది. ఎందుకంటే నాన్ వెజ్ తినరు కనుక. కానీ పనీర్‌లో విటమిన్ బి12 ఉంటుంది కనుక వారిలో ఏర్పడే ఈ విటమిన్ లోపాన్ని పనీర్‌తో అధిగమించవచ్చు. పనీర్ విటమిన్ బి12 లోపాన్ని సరిచేసి రక్తం తయారయ్యేలా చేస్తుంది. మెడ, భుజాల నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇలా పనీర్ వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- paneer
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

