అరుదైన మెదడు వ్యాధికి అధునాతన చికిత్స
స్టార్ హాస్పిటల్స్‌లో మణికట్టు ద్వారా నిర్వహించిన పిన్‌హోల్ సర్జరీ విజయవంతమైంది. మణికట్టు కేంద్రంగా ధమనుల్లోని ఒక చిన్న ధమని ద్వారా మెదడు రక్తనాళ వ్యాధిని నయం చేశారు స్టార్ హాస్పిటల్ వైద్యులు. చాలా సంక్లిష్టమైన న్యూరో ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్-పిన్‌హోల్ సర్జరీని స్టార్ హాస్పిటల్‌లోని న్యూరో ఇమేజింగ్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఆఫ్ న్యూరోసైన్సెస్ విభాగం విజయవంతంగా నిర్వహించింది.

ఓ పేషెంట్ ‘డ్యురల్ అర్టిరియోవీనస్ ఫిస్టులా’ అనే అరుదైన మెదడు రక్తనాళ వ్యాధితో బాధపడుతున్నాడు. మెదడు కణజాలానికి వాపును కలిగించే లక్షణమున్నా ఈ అరుదైన వ్యాధికి చికిత్స చేయకుండా వదిలేస్తే తలనొప్పి, మూర్ఛ, మెదడు లోపల ప్రాణాంతకమైన రక్తస్రావం జరుగుతుంది. ఈ క్రమంలో సదరు రోగి మాట్లాడలేకపోవడం, మూర్ఛ వంటి లక్షణాలలో బాధపడుతుండగా న్యూరాలజీ విభాగానికి రిఫర్ చేశారు. దీంతో అతనికి ఎంఆర్ఐ స్కాన్ చేయించగా మెదడు కణజాలం వాపునకు గురైనట్లు తేలింది. అంతేగాక అది ‘డ్యురల్ అర్టిరియోవీనస్ ఫిస్టులా’ అని యాంజియోగ్రామ్ నిర్ధారించినది.
ఆ సర్జరీని నిర్వహించిన న్యూరో అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డా.షహ్యాన్ సిద్దిఖీ మాట్లాడుతూ.. ‘కేంద్రీకృత ధమని ద్వారా యాంజియోగ్రామ్ నిర్వహించాం. అదే మార్గంలో సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాం. అసాధారణ ధమనులు, సిరల కనెక్షన్లలోకి మైక్రోక్యాథటర్ అనే సన్నటి గొట్టాలు, వెంట్రుక మందంగల మైక్రోవైర్లను నిర్ణీత మార్గంలో ప్రవేశపెట్టాం. వాటి ద్వారా ‘ఫిస్టులా’ అనబడే అసాధారణ కనెక్షన్ మూసివేసి, ఎంబోలిక్ ఏజెంట్ అనే ద్రవాన్ని ఇంజెక్ట్ చేస్తూ వాటికి తక్షణమే సీలు వేశాం’ అని చెప్పారు. ‘ఈ పద్ధతి ద్వారా కొన్ని గంటల్లోనే పేషెంట్ నడిచాడు. హాయిగా కూర్చున్నాడు. ఎవరి సాయమూ లేకుండా అతను కాలకృత్యాలు కూడా తీర్చుకున్నాడు. పిన్‌హోల్ సర్జరీ కాకుండా సంప్రదాయ పద్ధతుల్లో అంటే గజ్జ (తొడ)లోని ధమని గుండా ఆపరేషన్ చేస్తే, పేషెంట్ కనీసం 12 గంటల వరకు స్పృహలో లేకుండా, కదలలేని స్థితిలో ఉండవల్సి వచ్చేది. యూరినరి క్యాథటర్ తొడిగేవారు. దానితో పేషెంట్‌కు చాలా ఇబ్బంది కలిగేది. కానీ, ట్రాన్స్‌రేడియల్ రూటు ద్వారా న్యూరో ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్ నిర్వహించడం ద్వారా ఆపరేషన్ చాలా త్వరగా పూర్తయింది. ఓపెన్ బ్రెయిన్ సర్జరీతో పోల్చితే ఇది పేషెంట్‌కు సౌఖ్యాన్ని, భద్రతను పెంచింది. పైగా ఆసుపత్రిలో ఉండాల్సిన సమయాన్నీ తగ్గించింది. రోగి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో కూడా బాధపడుతుడంతో నెఫ్రాలజిస్ట్ డా॥రాజశేఖర చక్రవర్తి, న్యూరాలజిస్ట్ డా॥జి.వి.సుబ్బయ్య చౌదరి, న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డా॥షహ్యాన్ సిద్దిఖీతో కూడిన వైద్య బృందం పరీక్షించి, 48 గంటల్లోగా డిశ్చార్జ్ చేశారు.
డా. షహ్యాన్ మొహిసిన్ సిద్దిఖీ
కన్సల్టెంట్ న్యూరో ఇమేజింగ్ అండ్
ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ట్,
స్టార్ హాస్పిటల్స్, రోడ్ నెం.10,
బంజారాహిల్స్, హైదరాబాద్.
ఫోన్ : 040-44777700
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- brain disease
- treatment
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

