పిల్లలకు సమస్యాత్మకం అడినాయిడైటిస్..
ముక్కు వెనక, గొంతు పైభాగంలో ఉండే అడినాయిడ్స్ కణజాలంలో వాపు రావడాన్ని అడినాయిడైటిస్ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణం.
ముక్కు వెనక, గొంతు పైభాగంలో ఉండే అడినాయిడ్స్ కణజాలంలో వాపు రావడాన్ని అడినాయిడైటిస్ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణం. ఇది గురక, నోటినుంచి శ్వాస, మాటిమాటికి చెవి ఇన్ఫెక్షన్లు, వినికిడి తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పెదవులు పగలడం, ముక్కుకారడం, నోటినుంచి దుర్వాసన లాంటి సమస్యలకు దారితీస్తుంది.
ఇన్ఫెక్షన్, అలర్జీ, పొట్టలో ఆమ్లం పైకి తన్నుకు రావడం వల్ల వచ్చే మంట మొదలైన వాటివల్ల అడినాయిడ్ కణజాలంలో ఇన్ఫ్లమేషన్తో అడినాయిడైటిస్ వస్తుంది. ఇది పిల్లలకు రెండేండ్ల వయసు ఉన్నప్పుడు ఏర్పడి 8 ఏండ్లు వచ్చేసరికి పరిమాణం తగ్గిపోతుంది. అయితే, అడినాయిడ్స్ ఎక్కువ కాలంపాటు వాచిపోయి ఉంటే మాత్రం సమస్యాత్మకం అవుతాయి.
ముప్పు ఎవరికి?
- సీసాపాలు తాగే పిల్లలు.
- పడుకున్న భంగిమలో తల్లిపాలు తాగేవారు.
- ముక్కు లేదా గొంతు దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లు.
- ఏదైనా అలర్జీతో బాధపడే పిల్లలు.
సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
- ముక్కుకారడం.
- మాటిమాటికి చెవి ఇన్ఫెక్షన్లు.
- వినికిడి శక్తి తగ్గుతుంది.
- నోరు ఎండిపోతుంది.
- పండ్ల నిర్మాణం దెబ్బతింటుంది.
- ముక్కుతో మాట్లాడినట్టు ఉంటుంది.
- సన్నని ముక్కు, పైపెదవి చిన్నగా ఉండటం, అంగిలి ఇరుకుగా ఉండటం, ఇరుకుగా-పొడవుగా ఉండే అంగిలి, దంతాలు గజిబిజిగా ఉండే అడినాయిడ్ ఫేసీస్ సమస్య.
చికిత్స ఎలా?
అడినాయిడ్స్‌ను నిర్ధారణ చేయడానికి డాక్టర్లు పిల్లల ముక్కు, చెవులు, నోరు, గొంతు పరీక్షిస్తారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం అడినాయిడ్స్ వాపు, శ్వాసనాళంలో ఆటంకాలను పరిశీలించడానికి ఎక్స్ రే పరీక్ష కూడా సూచించే అవకాశం ఉంది. చాలావరకు పిల్లలకు 8 ఏండ్లు వచ్చేసరికి అడినాయిడ్స్ వాటంతట అవే తగ్గిపోతాయి. పరిశుభ్రంగా ఉంటూ, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. సమస్య లక్షణాలు మితంగా ఉంటే మామూలు చికిత్స సరిపోతుంది. ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే గనుక డాక్టర్లు యాంటిబయోటిక్స్ ఇస్తారు. అడినాయిడ్స్ పరిమాణం తగ్గడానికి ముక్కు స్ప్రేలు ఉపయోగించాల్సి ఉంటుంది. అయినా సమస్య తగ్గకపోతే వైద్యులు అడినాయిడెక్టమీ అనే సర్జరీ సిఫారసు చేస్తారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Adenoiditis
- Childrens
- nose
- Throat
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

