Hair fall | రోజూ ఈ గింజలు తింటే మీ జుట్టు పట్టులా దృఢంగా అవుతుంది !!
Hair fall | తిండిని బట్టే జుట్టు. కేశాలు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలంటే.. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండాలి. పళ్లెంలో విలువలు లోపించినప్పుడు జుట్టు రాలడం, పొడి బారడం తదితర సమస్యలు వస్తాయి.
Hair fall | తిండిని బట్టే జుట్టు. కేశాలు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలంటే.. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండాలి. పళ్లెంలో విలువలు లోపించినప్పుడు జుట్టు రాలడం, పొడి బారడం తదితర సమస్యలు వస్తాయి. అలా అని, మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు, నూనెలు పట్టించడం కూడా సరైన పని కాదు. దానికి బదులు వివిధ రకాల గింజలు తినాలి. వాటిలో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలు అపారం.
☛ నల్ల నువ్వులు, తెల్ల నువ్వులలో విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలం. ఇవి జుట్టును దృఢంగా, కాంతిమంతంగా మారుస్తాయి.
☛ కలోంజీ గింజలు జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. కొత్త జుట్టు వస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
☛ పొద్దుతిరుగుడు గింజల్లోని వివిధ పోషకాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, వాతావరణ కాలుష్యం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల నుంచి కేశాలకు రక్షణ కల్పిస్తాయి.
☛ మెంతులు జుట్టు ఎదుగుదలకు తోడ్పడతాయి. ఇవి చుండ్రు సమస్యను త్వరగా తగ్గిస్తాయి. అందుకే మెంతులను కూరల్లో వాడటం మంచిది. మెంతులను నానబెట్టి ఆ నీళ్లను తాగితే మరీ మంచిది.
☛ గుమ్మడి గింజల్లో జింక్, సెలీనియం, కాపర్, విటమిన్-ఎ, బి, సి ఉంటాయి. ఇవి జుట్టు పలుచబడకుండా కాపాడతాయి. అలాగే కేశాలునిగనిగలాడేలా చేస్తాయి.
☛ జుట్టు రాలడాన్ని అరికట్టడంలో, జుట్టు ఒత్తుగా పెరగడంలో అవిసె గింజలు ఉపకరిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని, కొలెస్ట్రాల్‌ను ఇవి నియంత్రిస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కృష్ణ.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

