Bad habits | మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని శాసిస్తాయన్నది పచ్చి నిజం. మనం ఎలాంటి అలవాట్లను కలిగి ఉంటామో.. అంతే ఆరోగ్యంగా ఉంటాం. మనలో చాలా మంది తెలియకుండానే లైఫ్‌ను డ్యామేజ్ చేసే తప్పులు చేస్తుంటారు. వీటి కారణంగా మనకు తెలియకుండానే మన జీవితం ప్రమాదంలో పడిపోతుంది. చేసిన తప్పును మళ్లీ మళ్లీ చేయకుండా ఉండటంపై ఆలోచన చేయాలి. జీవితాన్ని సంతోషకరంగా ఉండేందుకు మనం చేయకూడని అలవాటను తెలుసుకుని వాటిని ఎలా దూరం చేయాలని యోచించాలి. దీని కారణంగా మన జీవితాన్ని మరింత సంతోషకరంగా మలుచుకోవచ్చు.
వేడి నీటి స్నానం
మనలో చాలా మంది నిత్యం వేడి నీటితో స్నానం చేస్తుంటారు. ఇది చర్మం, వెంట్రుకలను డ్యామేజ్ చేస్తుంది. వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోయేందుకు సహకరిస్తుంది. హెయిర్ ఫాల్ ఉన్నవారు వేడి నీటితో స్నానం చేయడం మానుకోవడం ఉత్తమం. వేడి నీటితో స్నానం చేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అలాగే, శరీరం బరువును తగ్గించుకోవాలనుకునే వారు నిత్యం చల్లటి నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి.
శరీరం భంగిమ..
మనలో చాలా మందికి సరిగ్గా కూర్చోవడం కూడా రాదు. కుర్చీలో కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా వంకర టింకరగా కూర్చుంటాం. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇదే అలవాటు కనిపిస్తుంది. బ్యాడ్ బాడీ పోస్చర్ మనం విశ్వాసం లేమని ఎదుటి వారు గుర్తించేలా చేస్తుంది. పేషంట్ మాదిరిగా కనిపిస్తాం. శరీరం భంగిమ సరిగ్గా లేనిపక్షంలో మెడ నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ చెడు అలవాటును దూరం చేసుకోవాలంటే నిత్యం వ్యాయామాలు చేయాలి. దీంతో మనపై మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చోవాలి.
ఎక్కువ సేపు నిద్ర
మనలో చాలా మందికి ఎక్కువసేపు పడుకోవడం అంటే మహా ఇష్టం. ఎక్కువ సమయం నిద్రపోవడం ద్వారా మంచి రిలాక్సేషన్ పొందుతుంటామని అనుకుంటారు. అయితే, నిజానికి ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల మధుమేహం, గుండెపోటు వంటి వ్యా ధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ సమయం నిద్రపోకుండా టైం మేనేజిమెంట్ చేసుకోవాలి. 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ టైం నిద్రపోవడం వల్ల సమయం వృథా కూడా అవుతుంది. లేజీనెస్ పెరుగుతుంది. ఏ పనీ సక్రమంగా చేయలేక డిస్టర్బ్ అవుతుంటారు.
ఎక్కువ మొబైల్ వాడకం
మొబైల్ వాడకం అనేది ప్రస్తుతం అడిక్షన్‌లా మారిపోయింది. ఇది చాలామంది ప్రాబ్లం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఫోన్‌పై ఎక్కువ సమయం గడపడం ఆరోగ్యరీత్యా మంచిదికాదు. మొబైల్ ఫోన్‌ను విషయాలు తెలుసుకోవడానికి, అవసరమైన సందర్బాల్లో సంభాషించేందుకు మాత్రమే వినియోగించేలా చూడాలి. రాత్రి వేళ మొబైల్ వాడకం వల్ల కంటి సమస్యలు వస్తాయి. నిద్ర లేమి సమస్యలు కనిపిస్తాయి. అలాగే, మెడనొప్పి బాధిస్తుంది. టైం వేస్ట్ అవడంతోపాటు మన ప్రశాంతతను చెడగొడ్తుంది.
పోర్న్ వీడియోలు వీక్షించడం..
చాలా మంది యువకులు మొబైల్ ఫోన్లను పోర్న్ వీడియోలు చూసేందుకు వినియోగిస్తున్నట్లుగా ఇటీవలి ఒక అధ్యయనంలో తేలింది. మనకు తెలియకుండా ఈ వ్యసనానికి బాధితులుగా మారుతుంటాం. ఇలాంటి వీడియోలను వీక్షించడం వల్ల డిప్రెషన్, ఆందోళనకు దారితీస్తుంది. ఆలోచనలు పక్కదారి పట్టి ఇలాంటి పనులు చేయడానికి ఉసిగొల్పుతాయి. ఫలితంగా చిక్కుల్లో పడతాం. చదువుల్లో ఏకాగ్రత కోల్పోతాం. వీటిని పూర్తిగా మానుకోవాలి. సోషల్ మీడియాలో ఎక్కడైనా ఇలాంటి వీడియోలు కనిపిస్తే రిపోర్ట్ చేసి వాటిని డిలీట్ చేయడం ద్వారా మన మనస్సును వాటిపైకి పోకుండా చూసుకోవచ్చు.