గుండెపోటుకు సాలీడు వైద్యం

విజ్ఞానం అద్భుతమైంది. ప్రమాదకరమని అందరూ భయపడిన పదార్థమూ కొన్నిసార్లు ప్రాణాలను కాపాడుతుంది. అందుకు సాక్ష్యమే ఈ పరిశోధన. ఆస్ట్రేలియాలో కనిపించే ‘ఫనెల్ వెబ్ స్పైడర్’ అనే సాలీడు కాటును విష పూరితంగా భావిస్తారు. సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాంతకం అవుతుంది. ఆ విషమే లక్షల ప్రాణాలను కాపాడే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. అవును! గుండెపోటు వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆ అవయవానికి రక్తసరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా గుండె కణాలకు ఇక చనిపోయామనే సంకేతం అందుతుంది. ఈ సంకేతాన్ని ఆపగలిగితే మాత్రం ప్రాణాన్ని కాపాడినట్టే. ‘ఫనెల్ వెబ్ స్పైడర్’ విషంలోని Hi1a అనే ప్రొటీనుకు ఈ సంకేతాన్ని ఆపగల శక్తి ఉందని తేల్చారు శాస్త్రవేత్తలు. బ్రెయిన్ డెడ్ అయినవారి గుండెను దానం చేసే సమయంలోనూ.. ఆ ప్రక్రియ ఏమాత్రం ఆలస్యం అయినా, గుండె దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆ సందర్భంలో కూడా Hi1a ప్రొటీన్ చాలా ఉపయోగ పడుతుందని చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

