Sankranti movies | సంక్రాంతి పందెం కోళ్లు
Sankranti movies | తెలుగు చిత్రసీమకు సంక్రాంతి అతి పెద్ద సీజన్. పండుగ బరిలో నిలిచే సినిమాలు ఏమిటోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ సంక్రాంతి రేసు నుంచి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో పలువురు యువహీరోల చిత్రాలు అదృష్టాన్ని

తెలుగు చిత్రసీమకు సంక్రాంతి అతి పెద్ద సీజన్. పండుగ బరిలో నిలిచే సినిమాలు ఏమిటోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ సంక్రాంతి రేసు నుంచి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో పలువురు యువహీరోల చిత్రాలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాయి. దిల్‌రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న ‘రౌడీబాయ్స్’తో పాటు కల్యాణ్‌దేవ్ ‘సూపర్‌మచ్చి’, అశోక్గల్లా ‘హీరో’, ఎం.ఎస్.రాజు ‘7డేస్ 6నైట్స్’ సంక్రాంతికి ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి.
రౌడీబాయ్స్ వినోదాలు
రౌడీబాయ్స్ హంగామాను సంక్రాంతికి వెండితెరపై చూడాల్సిందే అంటున్నారు నిర్మాత దిల్‌రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘రౌడీబాయ్స్’. ఆశిష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. నిర్మాతలు మాట్లాడుతూ ‘పక్కా యూత్‌ఫుల్ సినిమా ఇది. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో వినోదం, ఎమోషన్స్ మేళవింపుతో సాగుతుంది. అంతర్లీనంగా చక్కటి ప్రేమకథ ఉంటుంది. ఆశిష్‌కు హీరోగా మంచి శుభారంభాన్ని అందిస్తుంది. అతడి నటన, నృత్యాలు ఆకట్టుకుంటాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్రధాన బలంగా నిలుస్తుంది’ అని చెప్పారు.
సూపర్ హీరో..
అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గల్లా పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ నెల 15న విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘అసమాన లక్ష్యాన్ని ఛేదించడం కోసం హీరోగా అవతారం ఎత్తిన ఓ సామాన్య యువకుడి కథ ఇది. ప్రేమ, యాక్షన్, వినోదం అంశాల సమాహారంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది.తొలి సినిమాలోనే అశోక్ గల్లా పరిణతితో కూడిన నటనను కనబరిచారు. అతడి పాత్ర, గెటప్ కొత్తగా ఉంటాయి. విభిన్నమైన కథాంశంతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు’ అని అన్నారు. జగపతిబాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, సమీర్‌రెడ్డి.
పండుగకు ‘సూపర్ మచ్చి’
‘జీవితమనే ఆటలో ఓ క్రీడాకారుడు ఎలా విజయతీరాలకు చేరుకున్నాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు పులివాసు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సూపర్ మచ్చి’. కల్యాణ్‌దేవ్, రచితారామ్ జంటగా నటిస్తున్నారు. రిజ్వాన్ నిర్మాత. ఈ నెల 14న విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచే చిత్రమిది. యాక్షన్‌తో పాటు కుటుంబవిలువలు, ప్రేమ అంశాల కలబోతగా ఉంటుంది. హీరోగా కల్యాణ్‌దేవ్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఎస్.ఎస్. తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని అన్నారు. సీనియర్ నరేష్, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు.
బ్యాచ్‌లర్ ట్రిప్
సుమంత్ అశ్విన్, మెహర్ చావల్, రోహన్, క్రితికాశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. ఎం.ఎస్.రాజు దర్శకుడు. సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకు లముందుకురానుంది. దర్శకుడు ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ ‘బ్యాచ్‌లర్ ట్రిప్ కోసం గోవా వెళ్లిన రెండు జంటల కథ ఇది. న్యూ జెనరేషన్ రొమాంటిక్ కామెడీ సినిమాగా ఆకట్టుకుంటుంది. కథ, పాత్రలతో యువతరం కనెక్ట్ అవుతారు. ‘డర్టీహరి’ తర్వాత మరోసారి వైవిధ్యతను నమ్మి నేను చేస్తున్న చిత్రమిది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.
Read Today's Latest Entertainment News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

