ఓటీటీ సరైన వేదిక

‘ఈ సిరీస్‌లో పనిచేసిన వారంతా మా అన్నపూర్ణ స్డూడియోస్ కాలేజీలో చదువుకున్నవారే. వారి మధ్యనున్న స్నేహం కథ బాగా రావడానికి దోహదపడింది’ అని చెప్పింది నిర్మాత సుప్రియ యార్లగడ్డ. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన వెబ్‌సిరీస్ ‘లూజర్-2’. ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్‌రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. అభిలాష్‌రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకులు. అన్నపూర్ణ స్టూడియోస్, స్పెక్ట్రమ్ మీడియా నెట్వర్క్స్ నిర్మించాయి. నేటి నుంచి ‘జీ5’ ఓటీటీలో టెలికాస్ట్ కానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ ‘అన్నపూర్ణ విద్యార్థులు ఈ సిరీస్‌కు పనిచేయడం ఆనందంగా ఉంది. సినిమా, ఓటీటీ కథలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఓటీటీలో ప్రతి పాత్రను వివరంగా ఆవిష్కరించాలి. కథలో కాస్త లాగ్ ఉంటేనే అందం కనిపిస్తుంది. ఇలాంటి కథల్ని ఓటీటీలోనే చెప్పగలం. క్రీడల్లో ఎత్తుపల్లాల్ని ఎదుర్కొన్న వారి కథగా ‘లూజర్-2’ చక్కటి భావోద్వేగాల్ని పండిస్తుంది’ అన్నారు. ‘పీరియాడిక్ కథ ఇది. తొలిభాగం మాదిరిగానే ఈ రెండో భాగాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు తెలిపారు. అద్భుతమైన కంటెంట్ ఉన్న సిరీస్ ఇదని ప్రియదర్శి తెలిపారు. రెండు భిన్న వయోభేదాలతో తన పాత్రను కొత్తగా డిజైన్ చేశారని శశాంక్ చెప్పారు.
Read Today's Latest Entertainment News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

