‘మేజర్’ నుంచి హృదయమా.. గీతం

అడివిశేష్, సయీ మంజ్రేకర్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్కా దర్శకుడు. జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ముంబయి ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్‌ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలోని ‘హృదయమా’ అనే గీతాన్ని ఈ నెల 7న విడుదలచేయబోతున్నారు. నాయకానాయికల మధ్య ప్రేమ బంధాన్ని ఆవిష్కరిస్తూ రొమాంటిక్‌గా తెరకెక్కించిన ఈ పాట సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. ఈ గీతానికి వీఎన్వీ రమేష్, కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా సిధ్‌శ్రీరామ్ ఆలపించారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్నందించారు. యథార్థ ఘటనలకు దేశభక్తిని జోడిస్తూ ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇటీవలే హిందీ వెర్షన్ డబ్బింగ్‌ను అడివిశేష్ పూర్తిచేశారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదలకానుంది. శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాష్‌రాజ్, రేవతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Entertainment News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

