వైద్యరంగం బలోపేతం
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సేవలు అందించేందుకు ఒకే రోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలు అందజేసిన ఘట్టం తెలంగాణ అభివృద్ధి వేగానికి ఒక నిదర్శనం. రాష్ట్రంలో వైద్యరంగంలో చోటు చేసుకుంటున్న సమూల మార్పులకు ఒక సంకేతం.
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సేవలు అందించేందుకు ఒకే రోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలు అందజేసిన ఘట్టం తెలంగాణ అభివృద్ధి వేగానికి ఒక నిదర్శనం. రాష్ట్రంలో వైద్యరంగంలో చోటు చేసుకుంటున్న సమూల మార్పులకు ఒక సంకేతం. హైదరాబాద్‌లోని అదే శిల్పకళా వేదికపై కొన్ని రోజుల కిందటే 969 మంది వైద్యులకు సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా నియామక పత్రాలు అందించారు వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు. స్టాఫ్ నర్సుల నియామకం, కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణ ప్రక్రియ మరోవైపు కొనసాగుతున్నది. తొమ్మిదేండ్లలో వైద్యారోగ్యశాఖలో మొత్తం 22,263 పోస్టులు భర్తీ కాగా, మరో 9,222 పోస్టులు భర్తీ కానున్నాయి. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రభుత్వ దవాఖానల స్వరూపాన్నే మార్చి వేస్తున్న ప్రభుత్వం సేవల స్వభావాన్నీ మార్చటానికి భారీస్థాయిలో నియామకాలు జరుపుతోంది.
ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రజా వైద్యరంగం పూర్తిగా కునారిల్లింది. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అంటూ సినిమాల్లో పాటలు కూడా వచ్చాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్.. వైద్యరంగాన్ని సమూలంగా సంస్కరించటానికి సంకల్పించారు. రాష్ట్ర బడ్జెట్లో గణనీయమైన కేటాయింపులు జరిపి, అవి క్షేత్రస్థాయిలో సవ్యంగా వ్యయమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా బస్తీ దవాఖానల నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల వరకూ పలు అంచెల్లో ఉన్న ప్రభుత్వ వైద్యరంగంలో గణనీయమైన ఫలితాలు రావటం మొదలైంది. గతంలో 35 మాత్రమే ఉన్న బస్తీ దవాఖానల సంఖ్య పదిరెట్లకు పైగా పెరిగింది. హైదరాబాద్ నలుమూలలా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు నిర్మాణమవుతున్నాయి. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లకు మహర్దశ పట్టింది. వరంగల్‌లో సెంట్రల్‌జైలు కనుమరుగై, ఆ స్థలంలో 24 అంతస్తులలో అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్ శరవేగంగా రూపుదిద్దుకుంటున్నది. జిల్లాల దవాఖానల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
మాతాశిశు సంరక్షణకు సర్కారు పెద్ద పీట వేసింది. న్యూట్రిషన్ కిట్లు, ఏఎన్సీ చెకప్‌లు, అమ్మ ఒడి వాహనాలు, కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు (61 శాతం) ప్రైవేటు దవాఖానలకు (39 శాతం) అందనంత దూరంలో నిలిచాయి. కంటి వెలుగు, ఉచిత డయాలిసిస్ కేంద్రాలు, ఉచిత ఆరోగ్య పరీక్షల కేంద్రాల వంటి అనేక రీతుల ఆరోగ్య సేవలు ప్రజల చెంతకు వచ్చాయి. కరోనా సమయంలో రాష్ట్రంలోని యావత్ ప్రజానీకానికి జ్వరపరీక్షలను నిర్వహించటం ప్రశంసలను అందుకున్నది. అటువంటి విపత్తులు భవిష్యత్తులో ఎదురైనా, సమర్థంగా ఎదుర్కోవటానికి వీలుగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సంఖ్యను, హాస్పిటల్ బెడ్ల సంఖ్యను పెంచటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. దీంట్లో భాగంగానే జిల్లాకొక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. జనాభా/మెడికల్ సీట్ల పరంగా ప్రస్తుతం దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉన్నాం. తెలంగాణలో నిశ్శబ్దంగానే చోటు చేసుకున్న ఒక గొప్ప పరిణామం ఈ వైద్యవిప్లవం.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వానని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

