కల నిజమే అయింది
కల పడ్డది తెల్లారగట్ల.. కోనసీమోళ్లు కట్ట గట్టుకొని కాళేశ్వరం టూర్కొచ్చినట్లు కాల్వలు రిజర్వాయర్లు చూసి అసూయనంతా ఎత్తిపోసినట్లు బ్యాక్‌వాటర్‌లో తెగ సెల్ఫీలు తీసుకున్నట్లు..
కల పడ్డది తెల్లారగట్ల..
కోనసీమోళ్లు కట్ట గట్టుకొని
కాళేశ్వరం టూర్కొచ్చినట్లు
కాల్వలు రిజర్వాయర్లు చూసి
అసూయనంతా ఎత్తిపోసినట్లు
బ్యాక్‌వాటర్‌లో తెగ సెల్ఫీలు తీసుకున్నట్లు..
కల పడ్డది తెల్లారగట్ల..
రోడ్లన్నీ హరితహారంతో
పచ్చని పొడవాటి జడ వేసుకున్నట్లు
కొమ్మలన్నీ వింజామరలైనట్లు
అటు ఇటుపోయే వాహనాలపై
ఆక్సిజన్ పన్నీరు జల్లినట్లు…
కలపడ్డది తెల్లారగట్ల..
సర్కార్ బడులన్నీ కొత్తగా
సకల సౌకర్యాలతో వెలుగుతున్నట్లు
నల్ల బల్ల డిజిటల్ అయి జిగేల్మన్నట్లు
పేద పిల్లలు ఇంగ్లీష్ రైమ్స్ పాడుతున్నట్లు
కార్పొరేట్ బడులు చాప సదురుకున్నట్లు….
కల పడ్డది తెల్లారగట్ల..
చెరువులన్నీ సముద్రాలైనట్లు
కొంగ బావలన్నీ తిరిగివచ్చి
కొత్తగా కాపురం మొదలుపెట్టినట్లు
తూములకు జలుబు చేసి
జిందా తిలిస్మాత్ అడిగినట్లు…
కల పడ్డది తెల్లారగట్ల..
నల్లగొండ బుద్ధవనానికి
నాలుగు మూలల నుంచి
బుద్ధ భక్తులు బారులు తీరినట్లు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో
విమానాలు ‘జామ్’ అయినట్లు..
కల నిజమే అయింది..!
కచ్చ నేల కనకం అయ్యింది
తెలంగాణ జనం తెగువ
దేశానికి తొవ్వ జూపింది
ఒక్కో పథకం ఫలించి
ఐఏఎస్‌లకే కొత్త పాఠమైంది..!!
– దాసరి మోహన్, 99853 09080
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- development
- dream
- ntkavithalu
- poem
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

