తెలంగాణ స్ఫూర్తి
నాతెలగాణ రాష్ట్రము సనాతన కాలమునుండి గూడ దు ర్జాతుల వారు చేసెడు దురాగత పాపములన్ దళించక ని ర్భీతిగ ఉద్యమమ్ముల నపేక్షిత పోరును సల్పె ఎప్పుడే
నాతెలగాణ రాష్ట్రము సనాతన కాలమునుండి గూడ దు
ర్జాతుల వారు చేసెడు దురాగత పాపములన్ దళించక ని
ర్భీతిగ ఉద్యమమ్ముల నపేక్షిత పోరును సల్పె ఎప్పుడే
రీతులగాని మౌనమును రిత్తగ దాల్చగ లేదు విజ్ఞతన్
వీరులకెప్పుడీ పుడమి పేరును గాంచె ననాది నుండియున్
పోరును సల్పి స్వేచ్ఛను అపూర్వముగా భువి కాంచ నెంచి యె
వ్వారల శత్రు మూకల రవంత మిగుల్చక పారదోలి యీ
భారత భూమిపై గనె వివర్ధిత స్ఫూర్తి నిరంతరమ్ముగన్
తెలగాణన్ తమ స్వార్థపూరితపు నిస్తేజంపు వ్యూహమ్ములన్
తలపెట్టన్ తమ దుష్టభావముల స్వాంతమ్మందు యోచించుచున్
మెలగన్ జూచెడు వారినోర్చుకొనుచున్ మేలందుటల్ జేయ నా
ఖలులన్ మానసమందు ఓర్చుకొనిరే కాఠిన్యమున్ జూపకన్
నైజామున్ సహియింపకీ జనము విన్నానమ్ము జూపించుచున్
తేజమ్మొప్పగ పోరు సల్పిరిట ఆ ధీశక్తులన్జూపుచున్
నైజమ్మున్ భువి జూపినారిచట సంధానించు వ్యూహమ్ములా
రాజుల్ కాలికి బుద్ధి సెప్పి చనగన్ రారాజులున్ వీరులున్
కాకతి వంశధీమణులు క్రాంతిని జూపుచు శత్రుమూకలన్
పీకమడంచ గల్గిరి సువీక్షతమౌ తగు పోరుసల్పి ఎం
దాక తెలుంగు నేలది ముదమ్మున నుండెనొ అంతదాక వి
ద్యాకిరణమ్ములుం దగ నయమ్మును పంచుచు నుండి రెప్పుడున్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

