మా సారు రాకతో తెలంగాణల ఎలుగులు నిండినై
ఎలుగులు నిండిన నేల మీద నీళ్లుపారినై
నీళ్లు పారిన నేలకు రైతుబంధు అందింది
రైతుబంధుతో పొలాలన్ని పచ్చవడ్డయి
ఉప్పునీళ్ళ బాయిలన్నీ మూతవడి
తియ్యటి భగీరథ తీర్థం తాగుతున్నం
అరవై యేండ్ల శాత కాని అయ్యవ్వలకు
ఆసరా పింఛను అకిట్లకే పంపిండు
సర్కార్ బడుల్లో పొద్దుగాల్నే పిల్లల
ఆకలి కడుపులకి అల్పాహారమట
సన్న బియ్యం పెట్టి మా పేదరికాన్ని కడిగేసి
గృహలక్ష్మితో మా ఇంట్ల దీపం ఎలిగించిండు
దివ్యాంగులకు సర్కారు ఒక గూటి తీరు మారితే
సౌభాగ్యలక్ష్మీ మహిళలకు ఒక గౌరవాన్నిచ్చింది
కల్యాణలక్ష్మి మా ఆడబిడ్డలను గల్మ దాటిస్తే
రుణమాఫీ రైతుల నెత్తి మీది బరువు దించింది
గ్యాస్ మొద్దు రేటు అల్కగ జేసి…
కేసీఆర్ బీమాతో కంటి నిండా
నిద్రపోయే కాలమొచ్చింది
ఎవ్వరచ్చి మొత్తుకున్న
పాతుకున్న గులాబీ జెండా పడిపోదు
దూసుకెళ్తున్న కారుకు మలుపులుండవు
ఎన్ని సూసిన కండ్లు మాయి
ఎంత ఏడ్చిన గుండె మాది
ఆ దినాల్ని మల్ల చూడబోము
ఇక మా ఏలు మీద ఇంకు సుక్క రంగే గులాబీ
– తుమ్మల కల్పన రెడ్డి 96404 62142