పాలమూరు గంగమ్మ
గొంతెండిపోయిన పొలాలకు దూపదీర్చకుండా మల్పుకపోయిండ్రు పచ్చని పంటలను ఎండవెట్టి సాపకిందా నీరులా మాటువేసిండ్రు
మా పాలమూరు గంగమ్మను
దొంగలు ఎత్తుకపోయిండ్రు
పచ్చగుండే పాలమూరును
కరువు జిల్లగ మాయ సేసి
గొంతెండిపోయిన పొలాలకు
దూపదీర్చకుండా మల్పుకపోయిండ్రు
పచ్చని పంటలను ఎండవెట్టి
సాపకిందా నీరులా మాటువేసిండ్రు
సందుపొంటి నంగనాచిలా
కళ్ళెట్టి కనికరం లేకుండా
మా కండ్లముందరే
బాజాప్తా ఎత్తుకపోయిండ్రు
కానీ… కాలం ఊకుంటదా
సానా దినాల నుంచి ఎదురుసూసింది
కలిసొచ్చే బిడ్డను కడుపున కన్నది
తొల్సూరు తెలంగాణను కన్నది
సాన్రోజుల నుంచి అనాథై
గుక్కబట్టి ఏడుస్తున్న పాలమూరును
అక్కున సేర్చుకున్నది
పక్కనుంచే పోతున్న కృష్ణమ్మ
కాళ్ళను కడిగి ముద్దాడింది
ఒక కాలు పాలమూరుల
రెండో కాలు రంగారెడ్డిల
పెట్టేటట్టు సూడమన్నది
కలిసొచ్చే కాలానికి
నడిచొచ్చే కొడుకు పుడ్తడని
తెలంగాణ పెద్దకొడుకు
పాలమూరును నెత్తిమీద పెట్టుకున్నడు
బరువు మోసేదాకా దించనని
శపథం సేసి పాలమూరుకు నీళ్లిచ్చిండు
ఇప్పుడు…పాలమూరు
వలసల జిల్లా కాదు
కరువు జిల్లా అసలే కాదు
వలసలు వాపస్ నీళ్ళూ వాపస్
పాలమూరిపుడు
పచ్చనిపంటల మాగాణం
ఎప్పుడూ ఎండిపోని
ఎత్తిపోతల జలపాతం
తెలంగాణ వచ్చినంక
మన అరిగోస తీరింది
మన కృష్ణమ్మ మళ్లా మనముందరకే
బిరాబిరా కదలివచ్చింది
ఎండిపోతున్న పాలమూరు జిల్లా
గొంతుకను తడిపింది
రైతన్నలకు సాగునీటి గోసను తీర్చింది
మనకు దశాబ్దాల కల సాకారమైంది
పాలమూరు జిల్లా ప్రజల దాహం తీరింది.
– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 9032844017
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

