చిన్నారుల పసి మనసుల్లో
సగర్వంగా ఎగురుతున్నది మన మువ్వన్నెల పతాక, నలు దిక్కుల వినిపించగ ఘన స్వాతంత్య్ర గీతిక!
సగర్వంగా ఎగురుతున్నది
మన మువ్వన్నెల పతాక,
నలు దిక్కుల వినిపించగ
ఘన స్వాతంత్య్ర గీతిక!
దేశ మాత సంకెళ్లు తెంచిన
త్యాగధనుల స్ఫూర్తి కలిక,
విశ్వమంతా పంచుతున్నది
స్నేహ సుగంధాల మల్లిక!
నింగిలోన ఎగురుతున్న
జెండా రెపరెపల వీచిక,
ఉరికొయ్యల మీద వదిలిన
కొన ఊపిరుల ప్రతీక !
దేశ సీమలను కాపాడు
సిపాయిల ధీర నమ్మిక,
దురాక్రమణదారుల పాలిట
దునుమాడే అపరకాళిక!!
దేశవాసుల భిన్నత్వంలో
ఏకత్వానికి అవతారిక,
విచ్ఛిన్నకర ఆలోచనలకు
వినాశకరమైన హెచ్చరిక!
చిన్నారుల పసి మనసుల్లో
దేశభక్తి పెంచే తీయని గుళిక,
నిరతము మనము గౌరవిస్తే
నిలబడు జాతీయ పతాక!!
– దుడుక వెంకటేశ్వర్లు , 9492907386
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

