సుశ్లోకం
అరక్షితం తిష్ఠతి దైవరక్షితం
సురక్షితం దైవహతం వినశ్యతి
జీవత్యనాథోపి వనే విసర్జితః
కృతప్రయత్నోపి గృహే వినశ్యతి
దేవుని దయ ఉంటే.. నిర్లక్ష్యంగా పడవేసిన వస్తువు కూడా సురక్షితంగా ఉంటుంది. దేవుని దయ లేకుంటే.. ఎంత జాగ్రత్తగా దాచిపెట్టినా ఉండ దు. అడవిలో వదిలి వేయబడినా అనాథ జీవించగలడు. ఇంటిలో జాగ్రత్తగా కాపాడబడుతున్న శిశువు జీవించకపోవచ్చు. మేనక-విశ్వామిత్రుల చేత వదిలి వేయబడిన శకుంతల జీవించి భరతుని పుట్టుకకు కారణం కాలేదా! అలాగే దైవ కృప ఉంటే అంతా సురక్షితమే.
– టి.సుధాకరశర్మ