తే.గీ. దీనులై దురపిల్లెడి దేశ జనుల
కాచి రక్షింపగోరి సంకల్ప దీక్ష
పూనినాడహో మన నేత; పూలు జల్లి
వెంట నడవగ రారండి వీరులార!
సీ. బరిలోన కలబడి వస్తాదులను పడ
గొట్టి గెల్చిన జగజ్జెట్టి యతడు
దురితులకేనాడు శిరమును వంచని
గండశైలమ్ముల గట్టి యతడు
ధాన్యధనం భాగ్య ధన్య తెలంగాణ
మాగాణముల పైడి మట్టి యతడు
సంరక్ష సంక్షేమ సమపాలకుండుగ
భరతమాతకు ముద్దు పట్టి యతడు
తే.గీ. కాన జనకోటి దీవించె కల్వకుంట్ల
చంద్రశేఖర రాయార్య జైత్రయాత్ర
అఖిల జగమున నప్రతి హతము కాగ
వీర కంకణమును గట్టె విజయ దశ్మి.
-డాక్టర్ అయాచితం శ్రీధర్ , 98498 93238