రాజులు మరణిస్తే
చుక్కలు నేల రాలిపోవచ్చు
కీర్తివంతుల పాలనా వారసత్వం
చరిత్ర నిత్యం మోస్తూనే ఉంటది!
ఏడు దశాబ్దాల కాలం కరిగినా
కాకతీయ ప్రభువుల చరిత్ర
తెలంగాణ ఎదలో నిలిచి
అస్తిత్వ ఉద్యమానికి ఊపిర్లూదింది!
మూలాల వెతుకులాటలో
వారసున్ని కనుగొన్న సంబురమిది
కాకతీయుల రాజధాని మరోసారి
ఎద ఉప్పొంగే పర్వదినమిది!
తరాలు గడిచినా తరగని సంపద
ఇప్పటికీ జలకళతో కళకళలాడే ‘ట్యాంకు’లు
అతర్జాతీయ కీర్తినార్జించిన ‘టెంపుల్స్’
వైభవోపేత నిర్మిత నమూనా ‘టౌన్స్’!
రాచరికాలు కాలగర్భంలో కలిసినా
నిత్యం గుర్తుచేసే రాతి తోరణాలు
వారసుడా తవ్విచూసుకో
కాకతీయులు@త్రి‘టి’స్!!
(ఈ నెల 7న కాకతీయ వారసుడొస్తున్న వేళ…)
-కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261