జాగృతి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న పాట ఇదే..

అల్లిపూల వెన్నల.. చెరువులోన కురవగా..
పూల ఇంద్రదనసులే.. నేల మీద నిలవగా..
కొమ్మలన్ని అమ్మలై.. వేల పూలు విరియగా..
పుట్ట మన్ను మట్టిలో మట్టి గౌరి పుట్టగా..
అల్లిపూల వెన్నెల.. చెరువులోన కురవగా..
తరలివచ్చె తంగేడు..తనకు పట్టుచీరగా..
రవికలాగా తామరా పువ్వులన్ని మారగా..
తనువుకేమో గుమ్మడి గంధమయ్యే నిలువునా..
పొద్దుపొడుపు దిద్దెనే నుదిటి మీద కుంకుమ..
కూలితల్లి గొంతులో కోయిలమ్మ కూయగా..
తెలంగాణకొచ్చెనే బతుకమ్మ పండుగ..
అమ్మ గుండె గూటికి.. ఆడపడుచు ఆటకి..
గునుగుపూల తోటకి.. ఎనుగు మీద తీగకి..
ఏరువాక ఎదలకి.. ఏటిలోని అలలకి..
కట్ల పూల కళ్లకి.. కానుకయ్యే పల్లెకి..
తరలి తరలి వచ్చెనే బతుకమ్మ
తరగలపై తరలిపోవు తన జన్మ..
మెట్టినింటి పిలుపుతో.. వెల్లిపోయే చెల్లిలా..
జ్లాపకాల బరువులో.. చెమ్మగిల్లె తల్లిలా..
ఆడబిడ్డ చెయ్యిని.. పల్లె తల్లి గడపని..
దాటిపోయి నీటిలో.. ఒదిగిపోయే వేలలో..
సాగనంపి చెల్లెలు.. చెరువు కొమ్ము చివరన..
మరల మరలి రమ్మని.. బతుకమ్మను వీడగా.
అల్లిపూల వెన్నల.. చెరువులోన కురవగా..
పూల ఇంద్రదనసులే.. నేల మీద నిలవగా..
కొమ్మలన్ని అమ్మలై.. వేల పూలు విరియగా..
పుట్ట మన్ను మట్టిలో… మట్టి గౌరి పుట్టగా..
–లిరిక్స్: మిట్టపల్లి సురేందర్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

